NTV Telugu Site icon

Chintamaneni Prabhakar: చింతమనేని సంచలన వ్యాఖ్యలు.. కంఠంలో ప్రాణం ఉండగా..!

Chintamaneni

Chintamaneni

Chintamaneni Prabhakar: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యేల చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గత అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానన్న ఆయన.. నా కంఠంలో ప్రాణం ఉండగా నా భార్య గాని, కూతురు గాని రాజకీయాల్లోకి రారు అని ప్రకటించారు.. ఇక, టీడీపీ అంటే ప్రభాకర్.. ప్రభాకర్‌ అంటే టీడీపీ అని స్పష్టం చేశారు. చింతమనేని ప్రభాకర్ లేని దెందులూరు ఉండదు.. దెందులూరు లేని ప్రభాకర్ ఉండడు అంటూ సంచలన కామెంట్లు చేశారు.

Read Also: Weather Updates : మార్చిలో పెరగనున్న చలి.. ఆ రాష్ట్రాల్లో వడగళ్ల వాన.. వాతావరణ శాఖ హెచ్చరిక

మరోవైపు.. కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తులు తనకి సీటు ఇవ్వొద్దంటున్నట్టుగా కొందరు కాకమ్మ కథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు చింతమనేని.. నన్ను కాదనేవాళ్లు కమ్మ సామాజిక వర్గంలోనే కాదు ఏ కులంలోనూ లేరని స్పష్టం చేశారు.. అంతేకాదు.. తనను వ్యతిరేకించేవాళ్లు ఉన్నారని నిరూపిస్తే నా అంతట నేనే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు. పార్టీ కోసం కొట్లాడడంలో భాగంగా 38 పోలీస్ కేసులు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పార్టీలో అంతర్గత పోరు లేకపోయినా, వెంట్రుక వాసి డిస్టబెన్స్ లేకపోయినా.. కావాలని నన్ను ఇబ్బందులకు గురిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చింతమనేని ప్రభాకర్‌.కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేయగా.. తొలి జాబితాలో చింతమనేని ప్రభాకర్ పేరును ప్రకటించలేదనే విషయం విదితమే.