NTV Telugu Site icon

MLA Eliza : పార్టీ నన్ను మోసం చేసింది.. పెత్తందార్ల కోసం..! వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Mla Eliza

Mla Eliza

MLA Eliza : సీట్ల మార్పులు చేర్పులు కొన్ని స్థానాల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చుపెడుతున్నాయి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ నన్ను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి నిత్యం జనంలో ఉన్నా.. పెత్తందార్ల మాట కోసం నన్ను పక్కనబెట్టారని అసహనం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో ఏం జరుగుతుందో పార్టీ అధినేత వైఎస్‌ జగన్ దృష్టికి వెళ్లడంలేదన్నారు. చింతలపూడిలో పెత్తందార్లకు పేదలకు మధ్య యుద్ధం జరిగింది.. కానీ, పార్టీ అధినేత జగన్ పెత్తందారులకే ప్రాధాన్యత ఇచ్చారని కామెంట్‌ చేశారు.

Read Also: Mitchell Santner Covid 19: మిచెల్‌ సాంట్నర్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో న్యూజిలాండ్‌ స్టార్!

ఎంపీ కోటగిరి శ్రీధర్ కు, నాకు మధ్య విభేదాలు ఉన్నాయి.. పెత్తందారుల కాళ్లపై పడలేదు కాబట్టి నన్ను పక్కనబెట్టారని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే ఎలిజా.. నేను పని చేశానో లేదో జనాన్ని అడిగితే చెప్తారన్న ఆయన.. ఒక పథకం ప్రకారం పార్టీ పెద్దలకు లేనిపోనివి చెప్పి తప్పుడు రిపోర్టులు ఇచ్చారని.. పార్టీ చెప్పిన అన్ని పనులు నేను చేస్తూ వచ్చాను.. అన్ని చేసినా రిపోర్టులు బాగాలేదు అనడం అంటే పొమ్మనలేక పొగ పెట్టడమే అన్నారు. పార్టీ చేసే సర్వేలో రిపోర్టులు మంచిగా చెప్తున్నా కొంతమంది సీఎం వైఎస్‌ జగన్‌ను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. నాకు వ్యతిరేకంగా ఉన్న రిపోర్టులు ఏంటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. నా దగ్గర ఉన్న రిపోర్టులు బయట పెడతానని సవాల్‌ చేశారు. ఇప్పుడు చింతలపూడిలో వైసీపీ, టీడీపీ – జనసేన తరపున బరిలో దిగబోయేది అందరూ పెత్తందారుల మనుషులే అంటూ మండిపడుతున్న ఎమ్మెల్యే ఎలిజా చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments