కేటీఆర్ విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్ చిన్నపాటి వర్షానికే జలమయం అవుతోందని ఆరోపించారు బీజేపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది విశ్వ నగరమా? విషాద నగరమా? అని ఆయన ఎద్దేవా చేశారు. నాలాల గుండా వెళ్లాల్సిన నీరు రోడ్లపై పారుతోందని, ఇళ్లలోకి నీరు రాకుండా మీరు చేపట్టిన యాక్షన్ ప్లాన్ ఏంటి? గోడ కూలి ఎనిమిది నెలల పాప చనిపోయింది .. దీనికి బాధ్యత ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. నాలాల పూడిక తీత తీసి వ్యర్థాలను అలాగే వదిలేస్తున్నారని, వర్షం పడగానే మళ్ళీ అదంత నాలాలోకే వెళ్తోందన్నారు. నగరంలో బీఅర్ఎస్‌కు సీట్లు రావనే హైదరాబాద్ ను గాలికి వదిలేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఅర్ఎస్‌కు హైదరాబాద్ మీద విజన్ లేదని, కుక్కల దాడిలో పిల్లలు చనిపోయినా.. కేటీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని ఆయన ధ్వజమెత్తారు. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు అంతా ప్రధాన నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ లోకి చేరుతోందని, ఇవి రాకుండా చర్యలు చేపట్టి.. సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా మారుస్తామన్న మాట ఏమైందీ? అని ఆయన అన్నారు.
Also Read : Yasangi : యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం
హైదరాబాద్ కు మంజీర నీళ్ళు ఇవ్వడం ఎందుకు ఆపేశారని, లీటర్‌కు 4రూపాయలు ఖర్చుతో వచ్చే గండిపేట నీళ్ళు ఇవ్వడం అపేసి 24రూపాయలు ఖర్చు చేసి కృష్ణ నది నీరు ఇస్తున్నారని, ఈ ఖర్చంతా ఎవరు భరించాలి? అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీలు నగరంలో నాలాలు, ఎఫ్‌టీఎల్ భూముల్ని కబ్జా చేస్తున్నారని, రానున్న రోజుల్లో నగర అభివృద్ధిపై బీజేపీ ఉద్యమం చేస్తోందని ఆయన వెల్లడించారు.
Also Read : Virupaksha: థ్రిల్లర్ సినిమాకి నందమూరి హీరో కాంప్లిమెంట్స్…
