Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం.. అంతే కాదు.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవియే అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. తిరుపతి నుండి ఎమ్మెల్యేగా చిరంజీవి పోటీ చేయాలని కోరనున్నట్టు తెలిపారు.. అంతేకాదు మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవియే ఉంటారని స్పష్టం చేశారు. కాపులకు ఇదే సరైనా సమయమని పిలుపునిచ్చారు. ఇక, చిరంజీవిని నేనే స్వయంగా పార్టీలో ఆహ్వానిస్తానని పేర్కొన్నారు.. చిరంజీవి 50 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నామినేషన్ వేసి వెళ్లిపోతే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు.. ప్రజలు చిరంజీవికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.
Read Also: Donald Trump : ట్రంప్ లోపాలు బయటపెట్టిన జర్నలిస్టులు.. లీగల్ ఖర్చులు చెల్లించాలన్న కోర్టు
కాగా, గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చిరంజీవి.. సీఎం అయిఉంటే బాగుండేదని ఆ మధ్య చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం విదితమే.. అప్పట్లో సమీకరణాలు రాజకీయాలు తెలియకనే చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయారన్న ఆయన.. తనకు చిరంజీవి మంచి మిత్రుడు అని గుర్తుచేసుకున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ 125 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని గతంలోనే జోస్యం చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం పెరిగిందని, ప్రజలు.. ఏపీలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎంగా కాపులకు రెండున్నర సంవత్సరాలు, మరో రెండున్న సంవత్సరాలు మరో కులానికి అవకాశం ఇస్తామని పేర్కొన్న విషయం విదితమే.
Read Also: India- Maldives: భారత్ తో పెట్టుకోవద్దు.. ఇబ్బంది పడతావ్.. మాల్దీవుల అధ్యక్షుడికి ప్రజలు వార్నింగ్
అయితే, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ, ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పి.. మళ్లీ సినీ పరిశ్రమలు అడుగుపెట్టారు.. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. మరోసారి రాజకీయాలపై ఆసక్తి చూపుతారా? అనేది కీలకంగా మారింది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో అవసరం అయితే, తన సోదరుడు పవన్ కల్యాణ్‌కు అండగా నిలుస్తానని పేర్కొన్న చిరంజీవి.. ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.