Site icon NTV Telugu

China Rajappa: ఎమ్మెల్యేలకు జగన్ పై నమ్మకం ఉందా?

Rajappa

Rajappa

ఏపీలో ఎన్నికల సందడి మొదలయింది. ఇంకా ఏడాది కాలం ఉన్నా.. అధికార పార్టీ జగనే మా భవిష్యత్తు అంటూ వైసీపీ నేతలు జనంలోకి వెళుతున్నారు. గతంలో గడపగడపకు అని తిరిగిన నేతలు.. జగన్ స్టిక్కర్ అతికిస్తూ ..పథకాల గురించి, లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అయితే అధికార పార్టీపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి ఉందని, జగన్ పై ఎమ్మెల్యేలకు నమ్మకం ఉండడం లేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తిరుమలలో టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడారు. ఏపీలో పాలనపై ఆయన విమర్శలు చేశారు. పథకాలు ఇస్తూన్నామంటునే….దేవాలయాలలో ధరలు మాత్రం పెంచేస్తుందన్నారు.

Read Also: Dog attacks: సెకనుకో దాడి.. అరగంటకో మరణం.. ఐసీఎంఆర్‌ వెల్లడి

రాష్ర్టం అప్పులు పాలైపోయింది…రాష్ర్టానికి చంద్రబాబు అవసరం వుందని ప్రజలు గుర్తించారు. జనసేన-టీడీపీ పొత్తు పై అధినాయకత్వం మాట్లాడుతుంది…రాబోయే ఎన్నికలలో కలిసే వెళతాం అన్నారు చినరాజప్ప. ఎమ్మెల్యేలకే జగన్ పై నమ్మకం లేకపోతే….175 సీట్లు గెలుస్తామనడం హాస్యాస్పదం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేంత డబ్బు తెలుగుదేశం పార్టీ దగ్గర లేదన్నారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను జగన్ కొనుగోలు చేశాడు. ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారో చెప్పలేను కాని…చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ అధినాయకత్వం పై అసంతృప్తిగా వున్నారన్నారు చినరాజప్ప.

Read Also: Amul vs Nandini: కర్ణాటకలో “పాల వివాదం”..నందిని మిల్క్‌కు సపోర్టుగా బెంగళూర్ హోటల్స్..

Exit mobile version