Site icon NTV Telugu

Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్

Chiranjeevi, Chinmayi

Chiranjeevi, Chinmayi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది లేదని, పరిశ్రమ అద్దం లాంటిదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని, ‘మీటూ’ ఉద్యమకారిణి చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. చిరంజీవి పై గౌరవం ఉంచుతూనే, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న చీకటి కోణాలను ఆమె బట్టబయలు చేశారు.

Also Read : Sirai: బలగం రేంజ్ ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ డ్రామా!

చిన్మయి తన పోస్ట్‌లో స్పందిస్తూ.. ‘మీరు ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి.. ‘కమిట్‌మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇక్కడ అవకాశాలు రావు. మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం ఇక్కడ సర్వసాధారణం’ అని కుండబద్దలు కొట్టారు. చిరంజీవి గారి తరం వేరని, అప్పట్లో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని, కానీ నేటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెడుతూ చిన్మయి కొన్ని షాకింగ్ ఉదాహరణలు ఇచ్చారు.. ‘ఒక ప్రముఖ వ్యక్తి ఒక ఫిమేల్ మ్యూజిషియన్‌ను స్టూడియోలో లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రాణభయంతో సౌండ్ బూత్‌లో తనను తాను లాక్ చేసుకుంది. మరొక సీనియర్ వచ్చి కాపాడే వరకు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె ఈ రంగాన్నే వదిలేసింది. అలాగే ఒక ప్రముఖ గాయకుడు ఎటువంటి ప్రేరేపణ లేకుండా మహిళలకు తన పురుషాంగం ఫోటోలు పంపి, లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తుంటాడు. ఇలాంటి నేరస్తులకు సమాజం మళ్ళీ రెడ్ కార్పెట్ వేస్తుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత అనుభవం గురించి చెబుతూ.. లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించినప్పుడు తన తల్లి అక్కడే ఉందని, తల్లి పక్కనే ఉన్నా మగవారి బుద్ధి మారదు అనడానికి ఇదే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు కూడా మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోకుండా బాధితులను అవమానించడం బాధాకరమని చిన్మయి అన్నారు. ‘ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు.. ఇక్కడ పని ఇవ్వాలంటే సెక్స్ కోరుకునే పురుషుల ఆలోచనా ధోరణే పెద్ద సమస్య’ అని ఆమె తన సుదీర్ఘ పోస్ట్‌ను ముగించారు.

Exit mobile version