Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
- రంజీ ట్రోఫీ 2026-27లో చరిత్ర సృష్టించిన చిన్మయ్ సుతార్..
- 400 పరుగులతో అజేయంగా బ్యాటింగ్..
- రంజీ ట్రోఫీలో క్వాడ్రుపుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinmay Sutar: రంజీ ట్రోఫీ 2026-27 రెండో రౌండ్లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. నాగాలాండ్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో ఏకంగా 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో సుతార్ రంజీ ట్రోఫీ చరిత్రలో క్వాడ్రుపుల్ సెంచరీ (400) సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 77 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 29 ఏళ్ల చిన్మయ్ సుతార్ సోమవారం రెండో రోజు ఆటను 181 పరుగుల వద్ద కొనసాగించి ఈ మైలురాయిని అందుకున్నాడు. మొత్తం 517 బంతులు ఎదుర్కొని 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీనితో మిజోరం జట్టు 581/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
రంజీ ట్రోఫీలో ఇంతకుముందు క్వాడ్రుపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ బీబీ నింబాల్కర్. 1948-49 సీజన్లో కాఠియావార్పై మహారాష్ట్ర తరఫున నింబాల్కర్ 443 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇప్పుడు 77 ఏళ్ల తర్వాత చిన్మయ్ సుతార్ 400 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే సుతార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మణిపూర్‌తో తన తొలి మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు సాధించాడు. అంతకుముందు జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రపై ముంబై తరఫున లిస్ట్-A క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు పరుగులకే రనౌట్ అయ్యాడు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో భారత ఎమర్జింగ్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
Also Read
- BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
- WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
- Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
- 108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
సుతార్ అద్భుత ఇన్నింగ్స్‌కు 11వ నంబర్ బ్యాటర్ లాల్రెంపుయియా చక్చువాక్ కూడా మంచి సహకారం అందించాడు. మిజోరం 392 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతడు 76 బంతులు ఎదుర్కొని 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వికెట్ భాగస్వామ్యంలో వీరిద్దరూ ఏకంగా 189 పరుగులు జోడించారు. మిజోరం జట్టులో సుతార్ తర్వాత అత్యధిక స్కోరు జెహూ ఆండర్సన్ చేసిన 69 పరుగులే. దీంతో జట్టు మొత్తం స్కోరులో సుతార్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో 443 పరుగులతో బీబీ నింబాల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. 400* పరుగులతో చిన్మయ్ సుతార్ రెండో స్థానానికి చేరాడు. ఆ తర్వాత పృథ్వీ షా (379), సంజయ్ మంజ్రేకర్ (377), ఎంవీ శ్రీధర్ (366), తనయ్ అగర్వాల్ (366), విజయ్ మర్చంట్ (359*), సమిత్ గోహెల్ (359*), వీవీఎస్ లక్ష్మణ్ (353) ఉన్నారు.
తాజావార్తలు
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
-
Hyderabad: రూ.16 కోట్ల చిట్టీల మోసం.. ప్రధాన నిందితురాలు సీత అరెస్ట్
-
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
-
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
-
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!