శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఎనిమిది చైనా సైనిక విమానాలు, ఎనిమిది నౌకాదళ నౌకలు, మూడు విమానాలు తమ వైమానిక రక్షణ గుర్తింపు జోన్‌లోకి ప్రవేశించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది. ఎనిమిది విమానాలలో మూడు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ ఆగ్నేయ, నైరుతి వైమానిక రక్షణ గుర్తింపు జోన్‌లలోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచామని, పరిస్థితిని బట్టి ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఎంఎన్‌డీ వెల్లడించింది. అయితే.. తైవాన్ స్పందించి ఆ ప్రాంతానికి విమానాలు, నౌకాదళ నౌకలను పంపింది.
READ MORE: Nagarjuna Sagar: సాగర్ 26 గేట్లలో 16 గేట్లు మూసిన వేత.. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల
అయితే.. ఇది మొదటిసారి కాదు. చైనా తరచూ ఇలాంటివి చేస్తుంది. తాజా ఘటనతో తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కార్యకలాపాలను పెంచింది. 1949 నుంచి తైవాన్ స్వతంత్రంగా పరిపాలించబడుతుందని తెలిసిందే. అయితే చైనా తైవాన్‌ను తన భూభాగంగా పేర్కొంటోంది.