Site icon NTV Telugu

China: చైనా మాజీ అధ్యక్షుడికి భంగపాటు.. హు జింటావోను బలవంతంగా లాక్కెళ్లారా?

Former Chinese President

Former Chinese President

China: చైనా కమ్యూనిస్టు పార్టీ 20 మహాసభలు నేటితో ముగియనుండగా.. ఆ సమావేశాల్లో డ్రామా చోటుచేసుకుంది. అయిదేళ్లకు ఒకసారి జరిగే సీపీసీ సమావేశాలు గత ఆదివారం ప్రారంభం అయ్యాయి. కాగా నేడు చివరిరోజు కాగా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను సమావేశాల నుంచి బయటకు తీసుకెళ్లారు. బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆడిటోరియంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పక్కనే కూర్చొని ఉన్న మాజీ అధ్యక్షుడు హు జింటావోను కొందరు సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. హు జింటావో జిన్‌పింగ్‌కు ముందు చైనాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో జిన్‌పింగ్‌ పక్కనే ఉన్నా ఏమి మాట్లాడలేదు. నిజానికి అక్కడ ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ హు జింటావోను బలవంతంగానే లాక్కెళ్లినట్లు కనిపించింది.

T20 World Cup: కాన్వే 92 నాటౌట్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్

హు జింటావో వయస్సు ప్రస్తుతం 79 ఏళ్లు. మహాసభల్లో పాల్గొన్న హు జింటావో.. గత ఆదివారం సభ ప్రారంభ సమయంలో స్టేజ్‌పైకి వచ్చినప్పుడు కూడా స్థిమితంగా కనిపించలేదు. స్టీవార్డ్స్‌ తీసుకువెళ్తున్న సమయంలో హు జింటావో.. ప్రధాని లీ కీక్వాంగ్‌ భుజంపై చేయి వేశారు. సమావేశాల నుంచి వెళ్లిపోవడానికి ఇష్టం లేకున్నా.. బలవంతంగా హు జింటావోను తీసుకువెళ్లినట్లు వీడియోలో కనిపించింది. 2013లో జింటావో రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యారు. కొందరు సిబ్బంది వెంట ఉండి ఆయన్ను తీసుకెళ్లిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇవాళ ముగింపు సమావేశాల సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభల సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి సీపీసీ ఎన్నుకోనుంది. అధ్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్‌ బాధ్యతలు చేపడుతున్నప్పటికీ.. అది జీవితకాలం ఉండే అవకాశం ఉంది.

 

Exit mobile version