Site icon NTV Telugu

Chinaman: కార్మికులను బెల్టుతో తీవ్రంగా కొట్టిన చైనా వ్యక్తి.. చివరకు.. వీడియో వైరల్..

China

China

ఆఫ్రికా నుంచి చైనాకు పని చేసేందుకు వచ్చిన ఇద్దరు కార్మికులను ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. ఈ దెబ్బతో చైనా దేశ జాత్యహంకారాన్ని తీవ్రంగా విమర్శించారు నెటిజన్స్.

Also read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్..

ఓ ప్రముఖ జర్నలిస్ట్.. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. చైనీస్ కంపెనీ మేనేజర్లు కార్మికులను “ట్రాన్స్-అట్లాంటిక్ బానిసలు” చూశారని జర్నలిస్ట్ తెలిపారు. వైరల్ గా మరీనా వీడియో ప్రకారం.. ఇద్దరు యువకులు ఒక కంటైనర్‌లో ఉన్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ., చైనా కంపెనీ మేనేజర్ వారిని మందలించి బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. వారిని కొడుతుండగా., ఓ యువకుడు తలకు గాయం కాకుండా ఉండేందుకు చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఇద్దరు యువకులు అతన్ని కొట్టవద్దని వేడుకున్నా.. కానీ చైనా వ్యక్తి కనికరం లేకుండా కొట్టాడు.

Also read: TS TET: తెలంగాణ టెట్ పరీక్షలలో స్వల్ప మార్పులు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ..

చివరకు ఇద్దరి యువకులలో ఒక యువకుడిని కాలుతో తన్ని వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన వారు ఈ చైనా వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బానిసత్వం, జాత్యహంకారం అంతం కావడం గురించి అనేకమంది ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version