NTV Telugu Site icon

China Spy Ship : స్వదేశానికి చేరుకున్న శాటిలైట్ షిప్

China Spy Ship

China Spy Ship

China Spy Ship : చైనా అంతరిక్ష ట్రాకింగ్ షిప్ యువాన్ వాంగ్-5 తన సుదీర్ఘ మిషన్‌ను పూర్తి చేసి స్వదేశానికి చేరుకుంది. ఈ నౌక యాంగ్స్ ప్రావిన్స్ నుంచి తన సొంతగూటికి తిరిగి వచ్చింది. చైనాకు చెందిన జాంగ్సింగ్‌ 1ఈ శాటిలైట్‌ను హైనాన్‌ ద్వీపం నుంచి లాంగ్‌మార్చ్‌-7 శాటిలైట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఈ షిప్‌ సహాయం తీసుకున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా హై-స్పీడ్ డేటా, టెలివిజన్, టీవీ ప్రసారాలు అందించబడతాయి.

Read Also: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్ట్.. కదులుతున్న డొంక

యువాన్వాంగ్-5 నౌక దక్షిణ చైనా, హిందూ మహాసముద్రాల్లో 120 రోజుల పాటు 15 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించిందని చైనా అధికారులు తెలిపారు. ఈ మిషన్ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ఈ ఏడాది చివర్లో మళ్లీ సముద్రంలోకి పంపిస్తామన్నారు. యువాన్వాంగ్-5 నౌక ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌తోట నౌకాశ్రయానికి చేరుకుంది. ఓడ ఐదు రోజులు అక్కడే ఉంది. యువాన్వాంగ్-5లో అత్యంత అధునాతన రాడార్లను అమర్చారు. గతంలో ఈ నౌక ద్వారా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించారు.

Read Also:National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం

గంటకు 35.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ నిఘా నౌక క్షిపణులు, అంతరిక్షం, ఉపగ్రహాలను గుర్తించడమే కాకుండా 750 కి.మీ.ల దూరంలో ఉన్న గగనతలాన్ని కూడా పర్యవేక్షించగలదు. ఈ నౌక భారతదేశ తీరం దగ్గర నుండి బయలుదేరింది. మన తీర ప్రాంతంలోని కీలక స్థావరాలపై నిఘా పెట్టే అవకాశం ఉన్నందున భారత్ చైనాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే యువాన్వాంగ్-5 నౌక రాకపోకలకు శ్రీలంక అనుమతించింది. హిందూ మహాసముద్రంపై పట్టు పెంచుకునేందుకు శ్రీలంకను డ్రాగన్ దేశం పావుగా వాడుకుంటున్నది. ఈ నౌకపై భారత్, అమెరికా తదితర దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.