NTV Telugu Site icon

China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!

3

3

ఇదివరకు ఓసారి భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ డ్రాగన్ దేశం చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సద్దుమనగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలనే చేసి కాస్త నోరు పెంచింది. అయితే దీనిని భారత్ హాస్యాస్పదమైనవంటూ భారత్‌ తోసిపుచ్చుతున్న.. కానీ చైనా ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు జరిగిన సభలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి ఈ విధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకోందని మరోసారి చైనా నోరు పారేసుకుంది.

Also read: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్‌సీబీ కెప్టెన్

భారతదేశం ఏర్పడిన నుంచి చైనా, భారత్ ల మధ్య సరిహద్దు వివదాలు ఎప్పడికి పరిష్కారం కాలేదు. ఇక అరుణాచల్ భూభాగం గురించి చైనా 1987లో భారత్ అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించుకుందని., అంతకుముందు చైనా పరిపాలన కొనసాగిందని ఆదేశ విదేశాంగ అధికారి లిన్ జియన్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము భారత్ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని.. ఈ విషయంలో చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న మొండి వాదనను వారు కొనసాగిస్తున్నారు.

Also read: IPL 2024 – CSK VS GT: సీఎస్​కే పై గుజరాత్​ టైటాన్స్ ​దే పైచేయి.. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుందో..?!

ఇక తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించిన సేల సొరంగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని చూసి.. చైనా ఉలిక్కిపడినట్లు అయింది. దీంతో మరోసారి చైనా ఆ భూభాగం తమదేనని చెప్పడం మొదలు పెట్టింది. ఇలా చేయడం గడిచిన నెల రోజుల్లో నాలుగోసారి. ఈ అంశం పై భారత్ కూడా గట్టిగానే బదిలిస్తుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు.. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది., తాజాగా మరింత పెంచింది అని తెలుపుతూ.. ఈ విషయం భారత్ హాస్యాస్పదంగానే చూస్తుందని ఇప్పుడు కూడా అలాగే చూస్తుందని భారత విదేశాంగ మంత్రి ఇదివరకే తెలిపారు. తాజాగా జరిగిన యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు భారత విదేశీ శాఖ మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.