China Flood: భారీ వర్షాలతో ఇబ్బందుల్లో చైనా.. హైవే కూలి 36 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
china: గత కొన్ని రోజులుగా డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు చైనా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజాగా చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైవే రోడ్డు కుంగడంతో వాహనాలు గొయ్యిలో పడిపోవడంతో 36 మంది మరణించారు అని అధికారులు చెప్పారు. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మిజౌ, డాబు కౌంటీల మధ్య ఉన్న హైవేలోని కొంతభాగం బుధవారం నాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా భూమి లోపలికి కుంగిపోయింది. కొండప్రాంతంలో ఉన్న ఈ రోడ్డు కింది భాగంలోని మట్టి మొత్తం కొట్టుకుపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆకస్మాత్తుగా ఇలా జరగడంతో వేగంగా వచ్చిన వాహనాలు కొన్ని కింది పడిపోయాయి.
Read Also: Pushpa2 : వివాదాల నడుమ జనసేన గుర్తుతో అల్లు అర్జున్ ప్రచారం?
Also Read
అయితే, గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు మెయిజౌ నగర ప్రభుత్వం తెలిపింది. కాగా, హైవేపై ఉన్న 20 వెహికల్స్ పడిపోవడంతో ఈ ప్రమాదంలో దాదాపు 36 మందికి పైగా మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక, 500 మంది రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో గత రెండు వారాలుగా రికార్డు స్థాయిలో వడగళ్ల వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. గత వారాంతంలో ప్రావిన్షియల్ రాజధాని గ్వాంగ్‌జౌలో సుడిగాలి దెబ్బకు ఐదుగురు మరణించారు. మెయిజౌలోని కొన్ని గ్రామాలు ఏప్రిల్ ప్రారంభంలో ముంపునకు గురయ్యాయి.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!