Site icon NTV Telugu

Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

Girl Friend Scam

Girl Friend Scam

Girl Friend Scam: ఈ మధ్యకాలం లో మానవ సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు సంబంధించిన విషయాలు తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇందులో ఎక్కువగా వివాహేతర సంబంధాల కారణంగా కొందరి అమాయకులు బలవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. కేవలం పెళ్లి తర్వాత జరిగే సంఘటనలు మాత్రమే కాకుండా.. ప్రేమ, స్నేహం అనే ముసుగులు కప్పుకొని మరికొందరు కొన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ చైనా అమ్మాయి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షాక్ చేస్తోంది. మరి అసలు ఆ చైనా యువతి ఏమి చేసిందో ఒకసారి చూద్దామా..

Read Also:Polavaram Project: రెండోరోజు పోలవరం నిర్వాసితుల నిరసన దీక్ష.. పునరావాసం, నష్టపరిహారం డిమాండ్!

అవసరం ఎంతటి పనినైనా చూపిస్తుంది అనేలా ఓ చైనా యువతి చేసిన పని చూసిన తర్వాత చాలా మందికి నిజంగా నమ్మకం కలుగుతుంది. చైనా‌లోని షెన్జెన్‌ ప్రాంతానికి చెందిన యువతి షియాలీ తన కలల ఇంటిని కొనడానికి చేసిన పని ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్‌ అవుతోంది. చైనా అమ్మాయి 20 బాయ్‌ ఫ్రెండ్స్‌ తో ఒకరిని ఒకరికి తెలియకుండా ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ ప్రేమ మత్తులో ముంచిన ఆ అమ్మాయి తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్ తో ఐఫోన్ లను కొనించుకుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న.. ఆ మొబైల్స్ ను బయటి మార్కెట్ లో అమ్మి సొంత ఇంటిని కొనుక్కుంది.

Read Also:VIVO T4 Lite 5G: రూ.9,999 లకే ఇంత పవర్‌ఫుల్ ఫోన్ మరోటి ఉండదేమో.. వివో T4 లైట్ 5G మొబైల్ లాంచ్..!

అవును మీరు విన్నది, చదివింది నిజమే.. ఆ అమ్మాయి తన 20 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను వినూత్నంగా ఉపయోగించుకుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఐఫోన్ కోసం ఆమె ఒక్కొక్క బాయ్‌ఫ్రెండ్‌ను అడిగి, ఒక్కొక ఫోన్ తీసుకుంది. ఆ తర్వాత వాటన్నింటినీ ఓ మొబైల్ రీసైక్లింగ్ కంపెనీకి అమ్మేసి ఏకంగా 1,20,000 యువాన్స్ అంటే సుమారు రూ 14 లక్షలు వరకు సంపాదించింది. ఇంకేముంది ఆ డబ్బుతో తాను ఎప్పటి నుంచో కలలు కన్న ఓ ఇంటిని కొనుక్కుంది. ఈ వార్త ఎలా బయటికి వచ్చిందో తెలియకపోయిన ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లో వైరల్ అవుతోంది.

ఆ అమ్మాయి పేరు షియాలీ. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె.. తండ్రి మైగ్రంట్ వర్కర్‌గా, తల్లి గృహిణిగా ఉన్నారు. పెద్దకూతురిగా కుటుంబంపై ఒత్తిడి ఉండడం, తల్లిదండ్రుల వయసు పెరగడం వంటి కారణాలతో ఇంటి కొనుగోలు ఆమెకి అత్యవసరంగా మారింది. దీనితో ఈ దారుణానికి తేర లేపింది సదరు అమ్మాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఆమె పై పెద్దెతున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కొందరు ఆమె చేసిన పనిని అభినందించగా, మరికొందరు ఆమెను “విలువలు లేని వ్యక్తి” గా తప్పుబట్టారు. మరి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

Exit mobile version