Site icon NTV Telugu

China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!

China Bhutan

China Bhutan

China – Bhutan: ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న దేశం చైనా. ప్రస్తుతం డ్రాగన్ చూపు భూటాన్‌పై పడింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 1950ల నుంచి చైనా – భూటాన్‌ల మధ్య సరిహద్దు విషయంలో వివాదం నెలకొంది. కానీ 2020లో చైనా – భూటాన్ భూభాగంపై తన వింతైన వాదనను వినిపించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం చైనా ఆక్రమించిన టిబెట్ సరిహద్దుకు ఆనుకొని లేకపోవడం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సక్తెంగ్ వన్యప్రాణుల అభయారణ్యం. 2020లో జరిగిన గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ సమావేశంలో చైనా భూటాన్ భూమిపై తన వాదనను వినిపించింది. అయితే భూటాన్- చైనా వాదనలను పూర్తిగా తిరస్కరించింది.

READ ALSO: Rahul Gandhi: రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం లేదు: సీఆర్‌పీఎఫ్..

గొర్రెల కాపరులను పంపి.. ఆక్రమణ
చైనా మొదట ఇతర దేశాల భూమిలోకి తన గొర్రెల కాపరులను పంపి క్రమంగా ఆయా దేశాల భూమిని ఆక్రమించుకుంటుంది. తరువాత అక్కడ డ్రాగన్ సేనలు గస్తీ తిరుగుతూనే కొంచెం లోపలికి వెళ్తాయి. ఒక వేళ వివాదం తీవ్రమైతే, చర్చల తర్వాత డ్రాగన్ సైన్యం రెండు అడుగులు వెనక్కి వెళ్లి, తరువాత మళ్లీ గస్తీ తిరుగుతూ ఇతర దేశాల సైన్యాన్ని లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తాయి. ఇదే విధానాన్ని భారతదేశంతో అవలంభించడానికి అనేక విఫల ప్రయత్నాలు చేసింది చైనా. 2017లో డోక్లామ్‌లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయడానికి ప్రయత్నించింది.

రాయల్ భూటాన్ ఆర్మీ (RBA) సైనికులను డోక్లాం సమీపంలోని అమో-చు నది ఒడ్డున వారి స్వంత ప్రాంతంలో గస్తీ తిరుగుతుంటే చైనా సైనికులు ఆపివేసినట్లు కథనాలు వచ్చాయి. చైనాలోని చుంబి లోయలో పుట్టిన తోర్షా నది అమో-చు నదిగా భూటాన్‌లోకి ప్రవహిస్తుంది. డోక్లాం చేరుకున్న తర్వాత తోర్షా నది రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక తోర్షా డోక్లాం నుంచి జంఫేరి రిడ్జ్ వరకు కాల్వగా దక్షిణం వైపు ప్రవహిస్తుంది. మరొకటి తూర్పున భూటాన్‌లో అమో-చుగా విడిపోతుంది. ప్రత్యేకత ఏమిటంటే రాయల్ భూటాన్ సైన్యం పశ్చిమ భూటాన్‌లోని అమో-చు తూర్పు ఒడ్డున ఉన్న క్రాసింగ్ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి చేరుకున్నప్పుడు వారి సొంత స్థలంలో చైనా సైనికులు వారిని ఆపడం. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో వివాదాన్ని పరిష్కరించడానికి ఇరుదేశాల మధ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భూటాన్ సైన్యం గస్తీ తిరగడాన్ని చైనా PLA అభ్యంతరం వ్యక్తం చేసింది.

పలు నివేదికల ప్రకారం.. టిబెట్-భూటాన్ సరిహద్దుకు సమీపంలోని పచ్చిక బయళ్లకు వెళ్లకుండా భూటాన్ సైన్యం చైనా గొర్రెల కాపరులను ఆపింది. దీనిపై ఆగ్రహించిన చైనా జిల్లా యంత్రాంగం రాయల్ భూటాన్ సైన్యం ముందు ఈ అంశాన్ని లేవనెత్తింది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో జరిగిన సమావేశంలో గొర్రెల కాపరులను ఆపవద్దని చైనా భూటాన్ సైన్యానికి తెలిపింది. అలాగే గొర్రెల కాపరులను టిబెటన్ గొర్రెల కాపరులుగా కాకుండా చైనీస్ గొర్రెల కాపరులుగా పిలువాలని డ్రాగన్ సైన్యం చెప్పినట్లు సమాచారం.

2017లో డోక్లాంలో భారతదేశం చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత, చైనా మళ్లీ ఆ ప్రాంతాలలో పనులను వేగవంతం చేసింది. తోర్షా నాలా ముందు రోడ్డు నిర్మించకుండా చైనాను ఆపారు. కానీ డోక్లాంలో కూడా చైనా తన సన్నాహాలను పెంచింది. ఇప్పుడు తోరసా నాలా ప్రాంతంలో చైనా తన రక్షణను బలోపేతం చేస్తోన్నట్లు సమాచారం. దాదాపు 477 కి.మీ పొడవైన సరిహద్దుపై 80ల నుంచి చైనా – భూటాన్ మధ్య వివాదం ఉంది. అత్యంత వివాదం ఉన్న రెండు ప్రాంతాలలో ఒకటి 269 చదరపు కిలోమీటర్ల డోక్లాం ప్రాంతం. రెండవది భూటాన్‌కు ఉత్తరాన ఉన్న 495 చదరపు కిలోమీటర్ల జకర్‌లంగ్, పసమ్‌లంగ్ లోయ. అక్టోబర్ 2021లో చైనా – భూటాన్ ‘త్రీ-స్టెప్ రోడ్‌మ్యాప్’ ఒప్పందంపై సంతకం చేశాయి. గత 8 ఏళ్లలో భూటాన్ భూమిలో 20 కి పైగా గ్రామాలు పుట్టుకువచ్చాయి. ఇందులో డోక్లాంలోనే 8 గ్రామాలు ఏర్పడ్డాయి.

READ ALSO: Malati Murmu: మేడం సర్.. మేడం అంతే..

Exit mobile version