Site icon NTV Telugu

China Advisory to Citizens: ‘విదేశాల నుంచి భార్యలను తెచ్చుకోకండి.. బంగ్లాదేశ్‌లో డేటింగ్ చేయకండి’.. పౌరులకు చైనా సలహా

China

China

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తానని తెలిపిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం, విదేశీయులను వివాహం చేసుకోవడానికి సంబంధిత చట్టాలను ఖచ్చితంగా పాటించాలని చైనా పౌరులకు సూచించింది.

Also Read:PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్‌-2 టార్గెట్!

బంగ్లాదేశ్ పురుషుడు లేదా స్త్రీని వివాహం చేసుకోవడానికి ఆఫర్ చేసే అక్రమ వివాహ సంబంధాల ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, వీడియో ప్లాట్‌ఫామ్‌లలో క్రాస్-బోర్డర్ డేటింగ్ కంటెంట్ ద్వారా తప్పుదారి పట్టకండి. విదేశీ భార్యలను కొనకుండా ఉండాలని.. బంగ్లాదేశ్‌లో వివాహం చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా పౌరులను రాయబార కార్యాలయం హెచ్చరించింది.

Also Read:Vishnupriya : చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న విష్ణుప్రియ

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య వివాదం ఉంది. బంగ్లాదేశ్‌లోని మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ నిర్మించే ప్రణాళికపై సైన్యం, ప్రభుత్వం ముఖాముఖి తలపడుతున్నాయి. బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ నిర్మించడానికి యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికాతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read:Miss World Controversy: మిస్ వ‌రల్డ్ పోటీల‌పై సంచలన ఆరోపణలు.. విచారణకు కమిటీ ఏర్పాటు..

బంగ్లాదేశ్‌లో నిరసనలు నిరంతరం జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాల నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు అన్ని వైపుల నుంచి మహ్మద్ యూనస్ చుట్టుముట్టబడ్డాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ ఏడాది చివరిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. మహఫూజ్ ఆసిఫ్, ఖలీలుర్ రెహమాన్ వంటి నాయకులను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు ప్రారంభించాయి.

Exit mobile version