Site icon NTV Telugu

China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..

Chona

Chona

China : కరోనా మహమ్మారి మూడేళ్లుగా జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది. తగ్గింది అనుకున్న ప్రతీసారి ఎక్కడో ఓ చోట విజృంభిస్తోంది. వైరస్ రూపాంతరం చెందుతూ తానెక్కడికీ పోలేదని ఉనికి చాటుకుంటోంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు దాని భయం నుంచి బయటపడుతున్నారు. తాజాగా వైరస్ పుట్టినిల్లు చైనాలో మళ్లీ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్కడి కొన్ని నగరాల్లొ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.

Read Also: Gujarat Morbi Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 9మంది అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం

చైనాలోని సెంట్రల్ సిటీ ఆఫ్ జెంగ్ జౌలోని ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్ కాన్ లో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన లాక్ డౌన్ ను విధించింది. దీన్ని తప్పించుకునేందుకు పలువురు కార్మికులు ఫ్యాక్టరీ కంచెలు దూకి పారిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఇందుకోసం 100 కిలోమీటర్ల వరకు కాలినడకన ప్రయాణిస్తున్నారు. పగలు పొలాలమీదుగా రాత్రిళ్లు రోడ్ల మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. నిజానికి ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఐఫోన్లలో సగం ఈ ఫాక్స్ కాన్లోనే తయారవుతాయి. దాదాపు ఈ ఫ్యాక్టరీలో మూడు లక్షల మంది పనిచేస్తుంటారు.

Exit mobile version