Site icon NTV Telugu

Child Kidnapping Case: అబిడ్స్‌ చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం.. అదుపులో కిడ్నాపర్..

Child Kidnapping Case

Child Kidnapping Case

Child Kidnapping Case: హైదరాబాద్ నగరంలోని కట్టెలమండి అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈ కేసును అబిడ్స్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఐదు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ నర్వ గ్రామంలో పోలీసులు కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. నిందితుని పోలీస్ స్టేషన్ తీసుకువస్తుండగా పాప కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిందితున్ని స్థానికులు కుటుంబ సభ్యులు చితక్కొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Read also: Rangareddy Crime: దొంగతనం చేసిందనే అనుమానం.. మహిళను చితకబాదిన పోలీసులు

హైదరాబాద్ అబిడ్స్‌లో ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో కిడ్నాప్ చేసిన నిందితుడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించి.. గల్లిగల్లిలో గస్తీ నిర్వహించి కిడ్నాపర్ ఆచూకీ లభ్యమైంది. అనంతరం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ నర్వ గ్రామంలో కిడ్నాపర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలిక క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బాలికను, నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా చెబితే చిన్నారిని కిడ్నాప్ చేశాడా? లేక చిన్నారిని ఏదైనా చేసేందుకు కిడ్నాప్ చేశాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు. లేక డబ్బులు డిమాండ్ చేయడానికి చిన్నారిని కిడ్నాప్ చేసి వుంటాడా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Wayanad Landslides : చిద్రమైన ముఖాలు.. పాదాలను చూసి అంచనా వేయాల్సిన దుస్థితి.. వయనాడ్ విషాదం

Exit mobile version