కుటుంబ కలహాలకు పిల్లలు బలవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. సొంత తల్లి లేదా తండ్రి వారి ఉసురు తీసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారులను తండ్రి కర్కశంగా కడతేర్చాడు. అనంతరం సూసైడ్ చేసుకుంటున్నా అని లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడి మిస్సింగ్ కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. కలహాల కాపురానికి చిన్నారులు బలి.కలహాల కాపురానికి చిన్నారులు బలి.. ఇద్దరి గొడవల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.భార్య, భర్త మధ్య గొడవలకు చిన్నారులు బలి పశువులుగా మారుతున్నారు. ఇద్దరి గొడవల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన ఇలాంటి ఘటనే అందరినీ కలిచి వేస్తోంది..
మైలవరంలో రవిశంకర్ చంద్రిక దంపతులు నివసిస్తున్నారు. వీరికి హిరణ్య అనే 9 ఏళ్ల కుమార్తె.. లీలసాయి అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తలిద్దరి మధ్య వివాదాలు నడుస్తుండటంతో ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్య చంద్రిక కువైట్లో నెలన్నర క్రితం ఉద్యోగానికి వెళ్లింది. మరోవైపు రవిశంకర్ ఆర్థికంగా తీవ్ర అప్పుల్లో ఉన్నాడు ఈ పరిస్థితుల నేపథ్యంలో భార్య కూడా విడిచి వెళ్లిపోవటంతో తన ఇద్దరు బిడ్డల్ని రవిశంకర్ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు…
ఈనెల 12న పిల్లల తాత లక్ష్మీపతి.. కుమారుడు రవిశంకర్ ఇంటికి వెళ్లాడు. మనవడు లీలా సాయి సైకిల్ రోడ్డుపై ఎండలో ఉండటంతో దాన్ని ఇంటి దగ్గర పెట్టేందుకు వెళ్ళగా ఇంటి నుంచి దుర్వాసన రావడం గుర్తించాడు. రెండు రోజుల క్రితమే లక్ష్మీపతి పిల్లల కోసం ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం పెట్టి ఉండటంతో వెనుతిరిగాడు. తాజాగా వెళ్లిన సమయంలో తాళం వేసి ఉన్నప్పటికీ దుర్వాసన రావడాన్ని గుర్తించాడు. మంచంపై మనవడు, మనవరాలు ఇద్దరు విగత జీవులుగా పడి ఉండటం చూశాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రవిశంకర్ సూసైడ్ లేఖ రాసినట్టుగా పోలీసులు గుర్తించారు. జీవితంలో ఏమి సాధించలేక చనిపోతున్నట్టు లేఖలో రవిశంకర్ పేర్కొన్నారు..ఫెర్రీ కృష్ణ ఘాట్ దగ్గర చివరగా ట్రేస్ అయిన సిగ్నల్.
రవిశంకర్ ఫోన్ సిగ్నల్ ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ కృష్ణ ఘాట్ దగ్గర చివరగా ట్రేస్ అవటంతో కృష్ణా నదిలోకి దూకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. అతని ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒక్కసారిగా కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోవడం రవిశంకర్ మిస్సింగ్ మిస్టరీగా మారడంతో స్థానికంగా విషాదాన్ని నింపింది. మరోవైపు పోలీసులు పిల్లల డెడ్ బాడీలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు..
