Site icon NTV Telugu

Turkey, Syria Earthquake : 22వేలు దాటిన మృతులు.. శిథిలాల కిందే వేలమంది

Turkey Earthquake

Turkey Earthquake

Turkey, Syria Earthquake :టర్కీ, సిరియా దేశాల్లో భూకంప విలయానికి మరణించినవారి సంఖ్య 22 వేలకు పెరిగింది. సుమారు 79 వేలమంది గాయపడ్డారు. నేలమట్టమైన శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని సహాయక బృందాలు రక్షిస్తూనే ఉన్నాయి. టర్కీ, సిరియాల్లో ప్రస్తుతం ఎటుచూసినా మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో నిండుకొని ఉంది. ఎటు చూసిన కుప్పకూలిన భవనాల శిథిలాలు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మృతుల సంఖ్య నమోదవుతుంది. ప్రస్తుతం వరకు 22వేల మందికిపైగా మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. వేలాది మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read Also: Atrocious: చిన్నారి పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టి చంపిన తాంత్రికుడు

ఆ దేశాల్లో శిథిలాల నుండి రెస్క్యూ సిబ్బంది శుక్రవారం చాలా మందిని సజీవంగా కాపాడారు. టర్కీ నగరమైన కహ్రామన్‌మరాస్‌లో దాదాపు ఈ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. భూకంపం సంభవించి నేటికి ఐదవ రోజులవుతోంది. 105వ గంటలో అంటాక్యాలో శిథిలాల నుండి 18 నెలల యూసుఫ్ హుసేయిన్‌ను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మూడేళ్ల జేనెప్ ఎలా పర్లక్ కూడా రక్షించబడింది. అడియామాన్ ప్రావిన్స్‌లో 60 ఏళ్ల ఇయుప్ అక్‌ను రక్షించారు. గాజియాంటెప్‌లో పిల్లలతో సహా ఇద్దరు వ్యక్తులను సజీవంగా బయటకు తీశారు. గురువారం రక్షక సిబ్బంది 90 గంటల తర్వాత 10 రోజుల శిశువు, అతని తల్లిని సజీవంగా బయటకు తీశారు.

Read Also:Shocking: తన అంత్యక్రియలను తానే చేసుకున్న వృద్ధుడు

1939 నుండి సోమవారం నాటి టర్కీలోని తూర్పు ఎర్జింకన్ ప్రావిన్స్‌లో చూసిన భూకంపాల్లో ఇదే అతిపెద్దది. సోమవారం నాటి ప్రకంపనల కారణంగా టర్కీలో 18,991 మంది, సిరియాలో 3,377 మంది, కలిసి మొత్తం 22,368 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు. విపత్తు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version