Site icon NTV Telugu

Child Po*n: చైల్డ్ పోర్నో చూస్తే జైలుకు

Child

Child

చైల్డ్ పోర్నోగ్రఫీపై నిఘా సంస్థలు దృష్టిసారించాయి. పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆ అమెరికా సంస్థకు తెలిసిపోతుంది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా నేషనల్‌ సెంటర్‌ ‌ఆఫ్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లోయిటెడ్‌ చిల్డ్రన్‌.. నెక్‌మెక్ పని చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెక్యూరిటీ ఏజెన్సీలతో సమాచారం పంచుకుంటోంది. అమెరికా సైబర్‌ టిప్‌ లైన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణలో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒంటరిగా ఉన్నాం.. చేతిలో మొబైల్ ఉంది. ఒంటరిగా ఉన్నాం.. చేతిలో మొబైల్ ఉంది.. నన్ను ఎవరూ చూడడం లేదు.. ..పోర్న్ చిత్రాలు చూసే అలవాటు ఉంటే మానుకోండి. ఇలా అనుకుని ఎవరైనా పోర్న్ చిత్రాలు చూసే అలవాటు ఉంటే మానుకోండి..అశ్లీలం చూశారో అంతే సంగతులు.. భారత పోలీసులు, నిఘా సంస్థలు మాత్రమే కాదు.. అమెరికా సైబర్ టిప్ లైన్ లాంటి సంస్థలు కూడా దీనిపై నిఘా పెడుతున్నాయి. అశ్లీలం చూశారో అంతే సంగతులు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో ఈ సెక్యూరిటీ ఏజెన్సీలు నజర్ పెట్టాయి. సో.. తస్మాత్ జాగ్రత్త…

Off The Record: సీఎం రేవంత్ ని నాడు వద్దన్న నేతలే.. నేడు పోటీ పడి పిలుస్తున్నారా?

ఇక చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా దూకుడుగా ఉన్నారు. ఒక్కరోజులోనే చిన్న పిల్లల అశ్లీల వీడియోలు అప్‌లోడ్, షేర్ చేసిన 18 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఐఐటీలో చదివి ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూడా ఉన్నాడు. దీంతో పాటు చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. చాలామంది చదువుకున్న వాళ్లు ఎక్కువగా చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ పోలీసులు 225 కేసులు నమోదు చేశారు. ఇంటెర్‌‌నెట్‌ ఐపీ అడ్రెస్‌, ఫోన్‌ నంబర్స్, మెయిల్‌ అడ్రెస్
సోషల్‌ మీడియా అకౌంట్ల ఆధారంగా 10 FIR‌లు నమోదు.

అమెరికాలోని సైబర్‌ టిప్‌ లైన్ ఇచ్చిన సమాచారం, ఇంటెర్‌‌నెట్‌ ఐపీ అడ్రెస్‌, ఫోన్‌ నంబర్స్, మెయిల్‌ అడ్రెస్, సోషల్‌ మీడియా అకౌంట్ల ఆధారంగా ఇప్పటి వరకు 10 ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఇందులో సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా, హబీబ్‌నగర్ మల్లేపల్లి, నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురిని గుర్తించారు. ఐపీ అడ్రెస్, ఫోన్‌ నంబర్ల ఆధారంగా సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. వీరితో పాటు మరో ఆరుగురికి సంబంధించిన సమాచారం సేకరించి ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసే విధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చర్యలు చేపట్టారు…ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్‌ పోర్నోగ్రఫీపై నిషేధం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్‌ పోర్నోగ్రఫీపై నిషేధం ఉంది. చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్‌ చేసినా, చూసినా, అప్‌లోడ్‌ చేసినా వెంటనే అలర్ట్స్‌ వచ్చేలా అమెరికా కేంద్రంగా నేషనల్‌ సెంటర్‌ ‌ఆఫ్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లోయిటెడ్‌ చిల్డ్రన్‌.. నెక్‌మెక్ పని చేస్తోంది. ఆ సంస్థ.. భారత్‌కు చెందిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌బ్యూరోతో సమాచారం పంచుకుంటుంది. దీంతో సైబర్ టిప్‌ లైన్ ద్వారా చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూస్తున్న వారిని గుర్తిస్తున్నారు…

Off The Record: సీఎం రేవంత్ ని నాడు వద్దన్న నేతలే.. నేడు పోటీ పడి పిలుస్తున్నారా?

Exit mobile version