Site icon NTV Telugu

Phone : ఫోన్ తీశాడంటూ బావిలో వేలాడదీశారు.. చిన్నారిపై క్రూరత్వం

Phone Theft

Phone Theft

Phone: సెల్ ఫోన్ తీశాడంటూ క్రూరంగా చిన్నారిని బావిలో వేలాడదీశాడో వ్యక్తి. తాను దొంగతనం చేయలేదని చెప్తున్నా వినకుండా కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఈ ఘటనను ఒకరు వీడియో తీస్తూ మరొకరు బావిలో బాలుడిని వేలాడదీశారు. ఈ దృశ్ం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో జరిగింది. లవ్‌కుష్‌నగర్‌లోని అక్టోహాన్‌ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం మొబైల్ దొంగతనం చేశాడని బాలుడిని పట్టుకున్న నిందితుడు.. దారుణంగా కొట్టాడు.

Read Also: Weight Loss : బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే రూ.1000కోట్ల బహుమతి

అంతటితో ఆగకుండా.. 20 అడుగుల లోతైన బావిలో 5 నిమిషాల పాటు ఒక చేత్తో పట్టుకోని వేలాడదీసాడు. తాను దొంగతనం చేయలేదని వేడుకుంటున్నా కనీసం కనికరించలేదు.. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు వీడియో తీసి బాధిత చిన్నారి తల్లిదండ్రులకు చూపించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు బాధిత చిన్నారితో కలిసి లవకుష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ హేమంత్ నాయక్.. నిందితుడు అజిత్ రాజ్‌పుత్‌పై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read Also: Newyork : అమెరికాలో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ గుంటూరు వాసి మృతి

అయితే.. తాను ఈ దృశ్యాన్ని రికార్డు చేసి బాలుడి తల్లిదండ్రులకు చూపించడంతోనే ఈ ఘటన కలకలం రేపిందని.. లేకపోతే.. ఇంత జరిగేది కాదంటూ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి ప్రతా దూబే తనను కొట్టారని.. కులం పేరుతో దూషించారని వీడియో తీసిన వ్యక్తి కిషోర్ ఆరోపిస్తున్నాడు. కాగా.. బావిలో 14 అడుగుల మేర నీరు నిండి ఉందని.. నిందితుడు బాలుడిని వదిలేస్తే చనిపోయేవాడని.. బాధిత బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. వీడియో చూడగానే గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా.. దీనిపై ఛతర్ పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ స్పందించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని.. పోలీసుల వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Exit mobile version