NTV Telugu Site icon

Road Accident: రాయగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం

Road Accident

Road Accident

Road Accident: మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ముంబై-గోవా హైవేపై కారు ట్రక్కును ఢీకొనడంతో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో హైవేపై మాంగావ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Villagers attack on police: జల్లికట్టులో యువకుడు మృతి.. పోలీసులపై గ్రామస్తుల దాడి, టెన్షన్‌

ట్రక్కు ముంబైకి వెళ్తుండగా, కారు రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళుతోంది. భారీగా చిధ్రమైన కారు అవశేషాలు ప్రమాదను తీవ్రతను సూచిస్తున్నాయి. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం నేపథ్యం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడగా.. కాసేపటి తర్వాత హైవేపై ట్రాఫిక్ కదలికలు పునఃప్రారంభించబడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Show comments