తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకొని, రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే జరిగే న్యాయసదస్సు కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్టానికి స్పందించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు, ఎఐసిసి ముఖ్య నేతలతో పాటూ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు..
Also Read:Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఎన్నిక ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, న్యాయపరంగా వదులుకోవాల్సిన అంశాలు వంటి వాటిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.. తెలంగాణ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మనుసింగ్వీ ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది.. అయితే సదస్సు పూర్తవుగానే ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్తారని సమాచారం.. బీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగే ఆందోళన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 వ తేదీన రానున్నారు.
