NTV Telugu Site icon

CM Chandrababu: పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలి..

Chandrababu Review

Chandrababu Review

రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్దం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అంతేకాకుండా.. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు. భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందులో సీఎం.. కొన్ని సూచనలు చేశారు.

Read Also: Bengaluru: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం.. ఏం జరిగిందంటే..!

పట్టాదారు పాసు పుస్తకం చూడగానే రైతులకు భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. గత ఐదేళ్లల్లో రెవెన్యూ శాఖలో తెచ్చిన చట్టాలపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై చర్చించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా.. ఎటువంటి కొత్త చట్టాలు తేవాలని అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.

Read Also: Sangharsana: ఆగస్టు రేసులో మరో చిన్న సినిమా