Site icon NTV Telugu

CJI Justice DY Chandrachud: పరువు హత్యలపై సీజేఐ సంచలన ప్రకటన!

Cji

Cji

CJI Justice DY Chandrachud: భారతదేశంలో ఎవరినైనా ప్రేమించడం, కులాంతర వివాహం చేసుకోవడం, వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వల్లే వందలాది మంది యువకులు పరువు హత్యల కారణంగా మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ 90వ జయంతి సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రత్యేక అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నైతికత అనేది ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుందని అన్నారు. బలహీనమైన, అట్టడుగున ఉన్నవారు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు.

1991లో ఉత్తరప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఎలా చంపారో అనే పరువుహత్య కథనాన్ని ఆయన ఉదహరించారు. వారి ప్రకారం బాలిక సమాజానికి వ్యతిరేకంగా అడుగు పెట్టిందని గ్రామస్థులు నేరంగా పరిగణించారని తెలిపారు. గ్రామస్తులు నేరాన్ని అంగీకరించారని కథనం పేర్కొంది. వారు నివసించిన సమాజంలోని ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నందున వారి చర్యలు (వారికి) ఆమోదయోగ్యమైనవని.. ఆ చర్యలు సమర్థించబడ్డాయన్నారు. బలహీనమైన, అట్టడుగు వర్గాలకు చెందిన సభ్యులు ఆధిపత్య సమూహాలకు లొంగిపోవలసి వస్తుందనీ, అణచివేత కారణంగా వారు వ్యతిరేక సంస్కృతిని అభివృద్ధి చేయరని సీజేఐ అన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన సభ్యులు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని సీజేఐ అన్నారు. ఆధిపత్య కులాల చేతిలో నిమ్న కులాల వారు అవమానాలకు, దోపిడీకి గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. శక్తిమంతులు ఏం నిర్ణయం తీసుకుంటారో అది నైతికతగా పరిగణిస్తామన్నారు. బలహీన వర్గాలు తమ సొంత నిబంధనలు రూపొందించుకోలేని విధంగా అణచివేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

PM Narendra Modi: ఎనిమిదేళ్లలో అశాంతి, అవినీతికి రెడ్ కార్డ్ ఇచ్చాం..

జిల్లా న్యాయవ్యవస్థ లేదా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కావచ్చు. కోర్టుకు ప్రతి కేసు కీలకమే. ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడానికి కోర్టులపై విశ్వాసం ఉంచుతారని సీజేఐ అన్నారు. హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా ఏ న్యాయస్థానానికైనా పెద్దది, చిన్నది కాదన్నారు. భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా హైలైట్ చేశారు. వ్యభిచారాన్ని శిక్షించే ఐపీసీలోని సెక్షన్ 497ని ఏకగ్రీవంగా కొట్టివేసిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు గురించి కూడా సీజేఐ మాట్లాడారు.

Exit mobile version