Elephants Attack : ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల భీభత్సం.. పాఠశాలలకు సెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants Attack : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా వాద్రాఫ్‌నగర్‌లో అడవి ఏనుగుల భీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏనుగుల చేష్టల కారణంగా ఇక్కడ ఐదు పాఠశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది. రోజు అస్తమించగానే అడవి ఏనుగులు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇళ్లను ధ్వంసం చేయడం ప్రారంభిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది రైతుల పంటలు కూడా నాశనమయ్యాయి. ఈ ఏనుగులపై అటవీశాఖ అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వాద్రాఫ్‌నగర్‌లోని కాకనేసలో గత పది రోజులుగా మూడు ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం అడవికి కూతవేటు దూరంలో ఉంది. ఈ ఏనుగుల గుంపు ఇంట్లో ఉంచిన ధాన్యం బస్తాలను కూడా నమిలేసింది. ఫిబ్రవరి 23 రాత్రి ఏనుగులు ఆ ప్రాంతంలోని పాఠశాలకు చాలా దగ్గరగా ఉన్న ఇంటిని కూడా కూల్చివేశాయి. ఏనుగుల బెడద దృష్ట్యా జిల్లా విద్యాశాఖాధికారి సమీపంలోని ఐదు పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Read Also:Group2 Exam: రేపు గ్రూప్-2 పరీక్ష.. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వసతులు
సెలవు ప్రకటించిన పాఠశాలల్లో ధంజరాలోని మధ్య, ప్రాథమిక పాఠశాల, బేత్రిపరాలోని ప్రాథమిక పాఠశాల, మరో రెండు ఉన్నాయి. ఈ ఏనుగులు రోజంతా అడవిలోనే ఉంటాయని, సాయంత్రం అయితే ఈ మూడు ఏనుగులు గ్రామం వైపు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గోధుమలు, కూరగాయల పంటలను ఏనుగులు ధ్వంసం చేయగా.. గ్రామంలోని మూడు ఇళ్లను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి.
అడవుల్లోకి వెళ్లవద్దని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ తరపున ప్రజలకు సూచించారు. ఏనుగుల దాడితో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే రాత్రిపూట మెలకువగా ఉండాల్సి వచ్చింది. ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు అటవీ శాఖ, ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం ఎలాంటి నిర్ధేశకమైన చొరవ చూపకపోవడం వల్లనే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
Read Also:TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!