NTV Telugu Site icon

Elephants Attack : ఛత్తీస్‎గఢ్‎లో ఏనుగుల భీభత్సం.. పాఠశాలలకు సెలవు

New Project (5)

New Project (5)

Elephants Attack : ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా వాద్రాఫ్‌నగర్‌లో అడవి ఏనుగుల భీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏనుగుల చేష్టల కారణంగా ఇక్కడ ఐదు పాఠశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది. రోజు అస్తమించగానే అడవి ఏనుగులు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇళ్లను ధ్వంసం చేయడం ప్రారంభిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది రైతుల పంటలు కూడా నాశనమయ్యాయి. ఈ ఏనుగులపై అటవీశాఖ అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

వాద్రాఫ్‌నగర్‌లోని కాకనేసలో గత పది రోజులుగా మూడు ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం అడవికి కూతవేటు దూరంలో ఉంది. ఈ ఏనుగుల గుంపు ఇంట్లో ఉంచిన ధాన్యం బస్తాలను కూడా నమిలేసింది. ఫిబ్రవరి 23 రాత్రి ఏనుగులు ఆ ప్రాంతంలోని పాఠశాలకు చాలా దగ్గరగా ఉన్న ఇంటిని కూడా కూల్చివేశాయి. ఏనుగుల బెడద దృష్ట్యా జిల్లా విద్యాశాఖాధికారి సమీపంలోని ఐదు పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

Read Also:Group2 Exam: రేపు గ్రూప్‌-2 పరీక్ష.. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వసతులు

సెలవు ప్రకటించిన పాఠశాలల్లో ధంజరాలోని మధ్య, ప్రాథమిక పాఠశాల, బేత్రిపరాలోని ప్రాథమిక పాఠశాల, మరో రెండు ఉన్నాయి. ఈ ఏనుగులు రోజంతా అడవిలోనే ఉంటాయని, సాయంత్రం అయితే ఈ మూడు ఏనుగులు గ్రామం వైపు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గోధుమలు, కూరగాయల పంటలను ఏనుగులు ధ్వంసం చేయగా.. గ్రామంలోని మూడు ఇళ్లను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి.

అడవుల్లోకి వెళ్లవద్దని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్‌ తరపున ప్రజలకు సూచించారు. ఏనుగుల దాడితో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే రాత్రిపూట మెలకువగా ఉండాల్సి వచ్చింది. ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు అటవీ శాఖ, ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం ఎలాంటి నిర్ధేశకమైన చొరవ చూపకపోవడం వల్లనే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

Read Also:TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం