Site icon NTV Telugu

Drinker : తాగకు కొడుకా.. అన్నందుకు తండ్రిని త్రిశూలంతో పొడిచాడు

New Project (4)

New Project (4)

Drinker : ఓ యువకుడు రోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవపడేవాడు. కొడుకును మద్యం తాగొద్దని తండ్రి మందలించాడు. ఆ విషయంలో యువకుడికి కోపం వచ్చింది. పరిగెత్తుకెళ్లి గుళ్లో త్రిశూలం తెచ్చి పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో జరిగింది. మద్యం తాగడం మంచిది కాదని చెప్పిన ఓ తండ్రిని కన్న కొడుకే చంపాడు. దుఖు రామ్(61), ఖేమ్‌లాల్ తండ్రీ కొడుకులు.

Read Also: Graeme Swann : నాగిని డ్యాన్స్ చేసిన గ్రేన్ స్వాన్

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఖేమ్‌లాల్ కూలీగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సెలవుపై స్వగ్రామానికి వెళ్లాడు. అంతకు ముందే ఖేమ్‌లాల్‌ మద్యానికి బానిసయ్యాడు. నాసిక్ నుంచి వచ్చిన తర్వాత రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. మద్యానికి బానిస కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి గ్రామంలోని శిత్లా దేవి గుడి సమీపంలో దుఖ్ రామ్ కూర్చున్నాడు. ఈ సమయంలో ఖేమ్‌లాల్ మద్యం తాగి అక్కడికి వచ్చి వారితో గొడవకు దిగాడు.

Read Also: Amritpal Singh: భింద్రన్‌వాలేగా కనిపించేందుకు సర్జరీ.. అమృత్‌పాల్ సింగ్ కేసులో సంచలన విషయాలు

దుఖు రామ్ మద్యం తాగవద్దని కొడుకును మందలించాడు. అయితే ఈ విషయంపై అతడికి కోపం వచ్చింది. గుడిలోకి పరుగెత్తి త్రిశూలాన్ని తీసుకుని తండ్రి ఛాతీపై కొట్టాడు. దుఖు రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన ఖేమ్‌లాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version