Site icon NTV Telugu

IAS Officer: అబ్బా అన్ని వందల కోట్లా.. మనోడు చేయి తిరిగినోడే

Sameer

Sameer

IAS Officer: దేశంలో అత్యున్నత పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్. ఎంతో బాధ్యతగా.. మరెందరికో ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ అడ్డదారులకు అలవాటుపడ్డాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వందల కోట్ల నగదును వెనకేసుకున్నాడు. కేవలం 16నెలల్లోనే దాదాపు 500కోట్లు వెనకేశాడంటే మనోడి పనితనం ఏమేరకు ఉందో అర్థమవుతుంది. కానీ చివరికి ఈడీ సోదాల్లో అడ్డంగా బుక్కయి జైలుపాలయ్యాడు. ఈ మనీలాండరింగ్‌లో కేసులో సదరు ఐఏఎస్‌తోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లను ఈడీ అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళితే..

సమీర్ విష్ణోయ్ 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఛత్తీస్‌గఢ్‌ జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్‌తో బొగ్గు రవాణా ద్వారా అక్రమంగా డబ్బు సంపాదనకు దార్లు తెరిచారు. బొగ్గు రవాణా కోసం ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా అనుమతులు తీసుకోవాంటూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో గనుల నుంచి బొగ్గును తరలించేందుకు గనుల మంత్రిత్వశాఖ ఆఫీసు నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ అనుమతులు తీసుకోవడం అనివార్యమైంది. ఇదే అదనుగా భావించిన సూర్యకాంత్‌ తివారీ ఎవరికి రవాణా అనుమతులు కావాలన్నా టన్నుకు రూ.25 చొప్పున వసూలు చేయడం ప్రారంభించాడు. ఇలా గడిచిన 16 నెలల్లో రూ.500 కోట్లకుపైగా కూడబెట్టినట్లు ఐటీ డాక్యుమెంట్లు చూపుతున్నాయి. ఈ మొత్తాన్ని రాజకీయ నాయకులు, ఇతర అధికారులకు పంపిణీ అయ్యినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Read Also: Kerala: కేరళ “నరబలి” కేసులో ట్విస్ట్.. నిందితులు మా పార్టీ కాదంటున్న సీపీఎం

ఈడీ సోదాల్లో సమీర్ విష్ణోయ్ ఇంటి నుంచి రూ.47 లక్షల నగదు, రూ.21 లక్షల విలువైన ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా ఆర్జించగా వచ్చిన సొమ్ముతో సమీర్ విష్ణోయ్ భార్య ప్రీతి గోదారా పెద్ద మొత్తంలో ఆస్తులు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేసినట్లు అంగీకరించింది. ఈ కేసులో మరో నిందితుడైన సునీల్ అగర్వాల్‌కు, సూర్యకాంత్ తివారీతో 10-15 ఏళ్లకు పైగా పరిచయం ఉంది. వీరిద్దరు కూడా ఐఏఎస్ అధికారులే. సూర్యకాంత్ తివారీకి చెందిన సంస్థ నుంచి రూ. 50 కోట్లకు రెండు వాషరీలను సునీల్ అగర్వాల్‌ కొనుగోలు చేశాడు. ఈ కేసులో మరో కీలక విషయం ఏంటంటే.. సత్య పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ అండ్‌ ఇండస్ ఉద్యోగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమానులను బలవంతం చేసి సునీల్ అగర్వాల్‌కు విక్రయించడానికి రెండు నెలల ముందే సూర్యకాంత్ ఈ వాషరీలను కొనుగోలు చేశాడు. అక్రమంగా సంపాదించిన డబ్బును సూర్యకాంత్‌ వీటికి ఖర్చు పెట్టాడు. ఈ కొనుగోలు విషయంలో సునీల్ అగర్వాల్, సూర్యకాంత్ తివారీకి సహాయం చేశాడు. ఈ ముగ్గురితోపాటు మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

Exit mobile version