Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sammakka Sagar Barrage: తెలంగాణలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కోరారు. ఈ విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కలిశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, మిగిలిన అనుమతుల ప్రక్రియలోనూ సహకరించాలని కోరారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో పాటు, 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అంచనా వేశారు. దీంతో ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం.. పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతాయి. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని నివేదికలో పేర్కొన్నారు. ఈ అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది.
Also Read
- Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
- క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
- Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
- SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను వినియోగించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడేలా ఎన్ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్‌కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
-
క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..