Site icon NTV Telugu

Chevireddy Bhaskar Reddy: నా అరెస్ట్‌ అక్రమం.. నోటీసు కూడా ఇవ్వలేదు..

Chevireddy

Chevireddy

Chevireddy Bhaskar Reddy: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి హల్‌ చల్‌ చేశారు.. ఏపీలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ చేసిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని కోర్టులో హాజరుపర్చే ముందు.. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ఈ సందర్భంగా నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు.. ఇది మంచి పద్దతి కాదు.. నాకు నోటీసు కూడా ఇవ్వలేదు.. నిన్న సాయంత్రం FIRలో నా పేరు పెట్టి అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు.. నా అరెస్ట్ అక్రమం అన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..

Read Also: Shekar Kammula: కుబేర లాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు!

ఇక, అంతకుముందు చెవిరెడ్డిని లిక్కర్ స్కాం కేసులో మూడున్నర గంటలపాటు విచారించారు పోలీసులు.. లిక్కర్ స్కాం కేసులో నిందితులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్‌ అధికారులు.. సిట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు దాటవేసినట్టుగా తెలుస్తోంది.. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పరిచయంపై ప్రశ్నించిన సిట్.. లిక్కర్ స్కాం అక్రమ నగదు పలుప్రాంతాల్లో ఎన్నికల్లో పంపిణీ చేయుడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర వహించినట్లు సిట్‌ గుర్తించింది.. రెండు గంటలపాటు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును కలిపి విచారించారట సిట్‌ అధికారులు.. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి పాత్ర, సాక్ష్యాలు ఎదురు పెట్టి మరీ ప్రశ్నించారట.. అయితే, కేసుతో తనకు సంబంధం లేదని సిట్ అధికారులకు సమాధానం ఇచ్చారట చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..

Exit mobile version