Site icon NTV Telugu

Chevella Bus Accident: గతంలో ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ దస్తగిరి.. ఈ ప్రమాదంలో మృతి!

Chevella Bus Accident

Chevella Bus Accident

Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరికి సంబంధించిన విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం వికారాబాద్‌లోని అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ.. ఆయన చాకచక్యంగా బస్సును అదుపు చేసి అందులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అయితే, నేడు అదే బస్సు ప్రమాదానికి గురై ఆయన మృతి చెందడం అత్యంత బాధాకరం.

మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్, 6000mAh బ్యాటరీతో Vivo Y19s 5G లాంచ్..!

ఈ విషాద ఘటనపై డ్రైవర్ దస్తగిరి సోదరుడు జావిద్ స్పందిస్తూ, ప్రయాణికులను కాపాడిన ఆ డ్రైవర్ ఈరోజు అదే బస్సు ప్రమాదంలో చనిపోవడం జీర్ణించుకోలేని నిజమని ఆవేదన వ్యక్తం చేశారు. దస్తగిరి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, ఆర్టీసీ బస్సును ఢీకొట్టి బోల్తా పడిన టిప్పర్ డ్రైవర్ వివరాలు కూడా తెలిశాయి. మృతి చెందిన టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఆయన దాదాపు ఒక సంవత్సరం నుంచి టిప్పర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందడం ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Chevella Accident Causes: బస్సు ప్రమాదానికి 12 ప్రమాద కారణాలు ఇవే..!

Exit mobile version