భారత టెస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా టెస్టు జట్టుకు దూరమైనా అతని ప్రదర్శన ఏ మాత్రం తగ్గలేదు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా.. ఆయన ఆడుతున్న రంజీ ట్రోఫీ 2024లో డబుల్ సెంచరీ సాధించాడు. పుజారా ప్రస్తుతం సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ D మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ సాధించి జట్టు స్కోరును పెంచాడు.
ఛత్తీస్‌గఢ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇది అతనికి 18వ డబుల్ సెంచరీ. దీంతో.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో పుజారా నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. 17సార్లు డబుల్ సెంచరీలు చేసిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్, మార్క్ రాంప్రకాష్‌లను వెనక్కి నెట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రికార్డు డాన్ బ్రాడ్‌మన్ పేరిట 37 సార్లు ఉంది. మరోవైపు.. ఈ ఇన్నింగ్స్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
Read Also: Dana Cyclone Alert: ఏపీ సహా పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు
37 – డాన్ బ్రాడ్‌మన్
36 – వాలీ హమ్మండ్
22 – పాట్సీ హెండ్రెన్
18 – చెటేశ్వర్ పుజారా
17 – హెర్బర్ట్ సట్‌క్లిఫ్
17 – మార్క్ రాంప్రకాష్
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు (ఇండియా)
18 – ఛెతేశ్వర్ పుజారా
11 – విజయ్ మర్చంట్
10 – విజయ్ హజారే
10 – సునీల్ గవాస్కర్
10 – రాహుల్ ద్రవిడ్
9 – వసీం జాఫర్
9 – పరాస్ డోగ్రా