Site icon NTV Telugu

LSG vs CSK: ధోని ధనాధన్ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ ఎంతంటే..?

Dhoni Ms

Dhoni Ms

IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో57 పరుగులు, 5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక, ఎప్పటి లాగే చివర్లో మహేంద్ర సింగ్ ధోని ( 9 బంతుల్లో 28 పరుగులు, 3ఫోర్లు 2 సిక్సర్లు ) ధోని 311.11 స్ట్రైక్ రేట్‌తో నాటౌట్ గా నిలిచి మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది.

Read Also: UP slab falls: రీల్స్ కోసం బాలుడు ఎంత పని చేశాడు.. చివరికిలా ముగిసింది!

ఇక, మొయిన్ అలీ జడేజాకు మంచి సపోర్టు ఇవ్వడంతో పాటు 20 బంతుల్లో 30 పరుగులు జోడించాడు. మొయిన్ ఆలీ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు ఓపెనర్ అజింక్య రహానే 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 పరుగులు చేయగా.. కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక, మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (0), శివమ్ (3), రిజ్వీ (1) దారుణంగా నిరాశపర్చారు. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్‌ ఖాన్, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

Exit mobile version