NTV Telugu Site icon

IPL 2023 : దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ స్కోర్..

Csk Batting

Csk Batting

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం రేసులో నిలిచింది. ఈ మ్యాచ్ లో ధోని సేన విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండానే ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం మిగిలిన జట్ల ఫలితాలపై సీఎస్కే టీమ్ ఆధారపడాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి ఇన్సింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లను కోల్పోయి 223 పరుగులు చేసింది.

Also Read : Supreme Court: పాత విద్యుత్ బిల్లును కొత్త యజమానుల నుంచి వసూలు చేసుకోవచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఇద్దరు అర్థ శతకాలతో చెలరేగారు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 79 పరుగులు ) హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ తో 87 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేశారు. వీరికి తోడు శివమ్ దూబే ( 9 బంతుల్లో 3 సిక్సులతో 22 పరుగులు ) కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు చివర్లో రవీంద్ర జడేజా ( 7బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు ) అద్భుతమైన షాట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులు మార్క్ ను ధాటింది. అయితే సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ లో చివరి బ్యాటింగ్ చేశాడు.

Also Read : Manoj Bajpayee: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ హీరో’ సంచలన వ్యాఖ్యలు