CSK vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్ దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 158 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని అందించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(21), ఇషాన్ కిషన్(32)లు జోరుగా మ్యాచ్‌ను ప్రారంభించినా ఎక్కువ సేపు నిలదొక్కుకోలేక పోయారు. తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ(21) బౌల్డ్ అయ్యాడు. తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన అతను ఆఖరి బంతికి ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(31)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఇషాన్ గాల్లోకి లేపిన బంతిని బౌండరీ వద్ద ప్రిటోరియస్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లలో టిమ్ డేవిడ్, తిలక్ వర్మలు మాత్రమే కాస్త రాణించారు.
Read Also: CSK vs MI: 5 వికెట్లను కోల్పోయిన ముంబయి.. 10 ఓవర్లలో స్కోరు ఇలా..
ముంబై బ్యాటర్లలో టిమ్ డేవిడ్ 31, ఇషాన్ కిషన్ 32 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో హృతిక్ షోకీన్ 13 బంతుల్లో మూడు సిక్సర్లతో 18 పరుగులు చేయడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సీఎస్‌కే బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండేలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మగలా ఒక వికెట్ తీశాడు. 157 పరుగులు అంటే చెన్నైకి పెద్ద లక్ష్యమేమీ కాదు. కానీ ముంబయి బౌలర్లు ఎలా రాణిస్తారో వేచిచూడాల్సిందే.
