Chennai Rains Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ధనవంతులు, ఐటీ జాబర్స్ కొందరు కుటుంబాలతో కలిసి విలాసవంతమైన హోటళ్లకు వెళుతున్నారు.
చెన్నై నగరంలో గతేడాది డిసెంబరులో భారీ వర్షాలు కురవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. చాలా చోట్ల బైక్స్, కార్లు కొట్టుకుపోయాయి. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. ధనవంతుల్లో చాలామంది విలాసవంతమైన హోటళ్లలో గదులు బుక్ చేసుకుని కుటుంబాలతో కలిసి దిగిపోతున్నారు. తాగునీరు, కార్ పార్కింగ్, విద్యుత్ సరఫరాతో పాటు వైఫై ఉన్న హోటళ్లకు షిఫ్ట్ అవుతున్నారట.
Also Read: Supreme Court CJI: సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తీర ప్రాంతమైన తమిళనాడును అతి భారీ వర్షాలు చెత్తుతున్నాయి. చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. చెన్నై శివారులోని సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీలోకి భారీగా వరద నీరు చేరడంతో స్టూడెంట్స్ బోట్స్ సాయంతో బయటకు వచ్చారు. ఎడతెఎరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపధ్యంలో చెన్నై నగరానికి వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.