చెన్నై నగరంలోని అల్వార్ పేట్ లోని అప్ మార్కెట్ ఏరియాలోని సెఖ్‌మెట్ పబ్ మొదటి అంతస్తులోని పైకప్పు గురువారం సాయంత్రం కూలిపోవడంతో ముగ్గురు వలస కార్మికులు మృతి చెందారు. మరో బాధితుడిని రక్షించి చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!
మృతులను దిండిగల్ కు చెందిన సైక్లోన్ రాజ్ (45), ఇద్దరు వలస కార్మికులు మణిపూర్ కు చెందిన మాక్స్, లాలీగా గుర్తించారు. రాజా అన్నామలై పురం నుండి ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మారుతం కాంప్లెక్స్ నుండి కమాండో ఫోర్స్ సిబ్బంది బృందం, అడయార్ కార్యాలయం నుండి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (NDRF) సిబ్బంది కూడా రెస్క్యూ మిషన్ లో నిమగ్నమై ఉన్నారు. తూర్పు చెన్నై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. ధర్మరాజన్ నేతృత్వంలోని పోలీసు బృందం కూడా సంఘటనను పర్యవేక్షించింది.
Also read: Tillu Square Twitter Review: టిల్లు అన్న మ్యాజిక్ రిపీటా? సినిమా హిట్టేనా?
పోలీసుల సమాచారం మేరకు, మూడు ‘108’ అంబులెన్స్ లను సెఖ్‌మెట్ పబ్ ముందు సిద్ధంగా ఉంచారు. రక్షక బృందాలు బాధితులని రక్షించిన వెంటనే, వారిని ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే, సెఖ్‌మెట్ పబ్ నుండి 50 అడుగుల కంటే తక్కువ దూరంలో ఉన్న బోట్ క్లబ్ మెట్రో స్టేషన్ పని కారణంగా పైకప్పు కూలిపోయిందని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. బోట్ క్లబ్ మెట్రో స్టేషన్ లో మెట్రో స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మెట్రో రైలు అధికారులు తెలిపారు.
4
