NTV Telugu Site icon

Brain Tumor Surgery: కనుబొమ్మల ద్వారా బ్రెయిన్ ట్యూమర్ కోసం కీహోల్ సర్జరీ..

Doctors

Doctors

వైద్య రంగంలో అరుదైన ఘనత లభించింది. న్యూరో సర్జన్ల బృందం 44 ఏళ్ల మహిళకు ఇన్సులర్ బ్రెయిన్ ట్యూమర్‌ను ట్రాన్స్‌ఫార్మేటివ్, నావెల్ ఐబ్రో కీహోల్ విధానం ద్వారా తొలగించారు. “ఈ అపూర్వమైన ప్రయత్నం ప్రపంచంలోనే మొట్టమొదటిది, న్యూరో-ఆంకాలజీ రంగంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది” అని చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్ (ACCలు) ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.

Hair Coloring: తరుచుగా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావచ్చు సుమీ..

సర్జరీ చేసుకున్న మహిళ బైక్ యాక్సిడెంట్ తర్వాత ఆస్పత్రికి చెక్-అప్ కోసమని వచ్చిందని.. ఆ సమయంలో వైద్యులు ఆమె మెదడులో ఒక యాదృచ్ఛిక కణితిని కనుగొన్నట్లు తెలిపారు. సెరిబ్రల్ కార్టెక్స్‌లో లోతుగా ఉన్న కణితిని తీసేందుకు శస్త్రచికిత్సతో అసాధ్యమని డాక్టర్లు పేర్కొన్నారు. ఇది మాట్లాడం, చూడటంపై ప్రభావితం చూపుతుందన్నారు. అంతేకాకుండా.. పక్షవాతం, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.

Uttam Kumar Reddy: మహేశ్వర్ రెడ్డి.. కనీస అవగాహన లేకుండా మాట్లాడొద్దు

ఈ క్రమంలో.. చెన్నై వైద్యులు కొత్తగా ఆలోచించి కనుబొమ్మల ద్వారా బ్రెయిన్ ట్యూమర్ కోసం కొత్త కీహోల్ విధానాన్ని బృందం ఎంచుకుంది. మెదడులో ఉన్న ఈ కణితిని తొలగించడానికి “క్లినికల్ ఎక్సలెన్స్, ఎఫిషియెన్సీ మరియు సేఫ్టీ”ని ఉపయోగించారు. దీంతో.. ఆమె సర్జరీ విజయవంతమైంది. కాగా.. 72 గంటల్లోనే మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆ మహిళ వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. అధునాతన చికిత్స తనకు స్వస్థత చేకూర్చడమే కాకుండా “నాకు ఆశాజనకంగా, ఓదార్పునిచ్చి, సాధారణ స్థితికి వచ్చేలా చేసింది” అని మహిళ పేర్కొంది.