NTV Telugu Site icon

Chelluboina Venugopal : లోకేష్ కు రాజకీయ అవగాహన ఉందా

Chelluboina Venugopal

Chelluboina Venugopal

కాసేపట్లో తాడేపల్లిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ గర్జన కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే.. ఎంపీ ఆర్. కృష్ణయ్య బీసీ సంఘం నేతృత్వంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు పలువురు బీసీ మంత్రులు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే బీసీ మంత్రులకు ఆర్. కృష్ణయ్య బీసీ సంఘం సన్మానం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ మాట్లాడుతూ.. లోకేష్ కు రాజకీయ అవగాహన ఉందా అని ప్రశ్నించారు. పార్టీ బీసీ నాయకుల సమావేశానికి విజయసాయిరెడ్డి ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి తన విధుల్లో భాగంగా కార్యక్రమంలో పాల్గొంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు తెచ్చింది ఎవరు?? బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబు కాదా?? ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే ప్రయత్నం టీడీపీ చేస్తోందని ఆయన మండిపడ్డారు.
Also Read : Proteins : పోషకాల లోపాన్ని ఇలా కనిపెట్టండి.. లేకుంటే కష్టామే..!

ఐదేళ్ళ కాలంలో బీసీలకు టీడీపీ ప్రభుత్వం కేటాయించిన దాని కంటే మూడేళ్లలో జగన్ ప్రభుత్వం 60 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల గురించి ప్రశ్నించటానికి మీరెవరు?? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బీసీల బంధువు అని, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బీసీల బంధువు అని ఆయన అన్నారు. రాంగోపాల్ వర్మ ముఖ్యమంత్రిని కలిసిన విషయం పై నాకు పూర్తి సమాచారం లేదని ఆయన వెల్లడించారు.