Chegondi Harirama Jogaiah: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా వరుసగా లేఖలు విడుదల చేస్తూ వస్తున్నారు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య.. ఈ సారి కాపులకు మేలుకొలుపు పేరుతో మరో లేఖ విడుదల చేశారు. కాపులు, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కాలంటే ఐకమత్యం ప్రదర్శించాలని.. అందుకు దైర్యవంతుడైన నాయకుడు కావాలి, జనాకర్షన గల సవ్యసాచి కావాలని పిలుపునిచ్చారు.
Read Also: AP DSC 2024 Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీ కోసం..
ఒకప్పుడు నేనున్నానంటూ చిరంజీవి వచ్చాడు.. అందరం ఆదరించాం.. చేయూతనిచ్చాం, అభిమన్యుడై మిగిలాడని లేఖలో పేర్కొన్న జోగయ్య.. అదే బాటలో పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం చేశారు.. అన్నకు మంచిన జనాకర్షణ ఉంది.. లక్ష్యసాధనకు అతని వ్యూహాలు అతనికి ఉన్నాయన్నారు. బలవంతుడైన శత్రువుని కొట్టాల్సి వచ్చినపుడు ఇష్టం లేకపోయినా.. మరొకరి సహాయం తీసుకోవటం అనే రాజనీతిజ్ఙత తెలిసినవాడు.. పొత్తు ధర్మంలో తనకి దక్కాల్సిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక వ్యూహాం ఉంటుందనడంలో సందేహపడాల్సిన పనిలేదు.. మీరంతా ధైర్యంగా ముందుకు నడవండి అంటూ లేఖ ద్వారా పిలుపునిచ్చారు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య.