Site icon NTV Telugu

Cheetah: 22 రోజులుగా కనపడకుండా పోయిన చిరుత.. ఆచూకీ లభ్యం

Chetha

Chetha

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో జూలై 21నుంచి ఓ చిరుత కనపడకుండా పోయింది. రేడియో కాలర్ పనిచేయడం మానేసినప్పటి నుంచి చిరుత జాడ తెలియలేదు. అయితే 22 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆదివారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పార్క్ లోని ధోరెట్ రేంజ్ లో ఉధయం 10 గంటలకు నిర్వా అనే ఆడ చిరుతను పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ చిరుతకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.

Read Also: Vishwak Sen: బిగ్ బ్రేకింగ్.. పెళ్లి పీటలు ఎక్కుతున్న విశ్వక్.. ?

గత 22 రోజులుగా ఆ చిరుత కోసం 100 మందికి పైగా ఫీల్డ్ సిబ్బంది, వైద్యులు, అధికారులు గాలించారు. అయితే ఆగష్టు 12న చిరుత ఎక్కడుందనేది డ్రోన్ ద్వారా చిరుతను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. ఆ చీతాను కనిపెట్టేందుకు అధికార బృందంతో పాటు, రెండు డ్రోన్లు, ఒక డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాల ఆధారంగా.. నిర్వా ఆరోగ్యంగా కనిపిస్తూ కదులుతుండటాన్ని గుర్తించారు. అప్పటికి చీకటి పడటంతో.. ఉదయం ఆపరేషన్‌ను పునఃప్రారంభించారు. డ్రోన్ బృందాలు రాత్రంతా చీతా ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు ఆదివారం తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. చీతాను పట్టుకున్నారు. నిర్వాను పట్టుకోవడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.

Read Also: Rajinikanth: జైలర్ హిట్ అవుతుందని నేను అనుకోలేదు.. రజినీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ లో మొత్తం 15 చిరుతలు ఉన్నాయి. అందులో ఏడు మగవి, ఏడు ఆడవి, ఒక ఆడపిల్ల ఉన్నాయి. ప్రస్తుతం అవి ఆరోగ్యంగానే ఉన్నట్లు కునో పశువైద్యుల బృందం తెలుపుతుంది. ఇండియాలో చిరుతలు అంతరించిపోతున్నాయనే నేపథ్యంలో.. నమిబీయా నుండి 8 చిరుతలను తీసుకొచ్చారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ వాటిని పార్కులో వదిలారు. ఫిబ్రవరిలో మరో 12 చిరుతలను తీసుకొచ్చారు. అయితే ఈ ఏడాది మార్చిలో జ్వాలా అనే నమీబియా చిరుత నాలుగు పిల్లలు జన్మనిచ్చింది. అందులో మూడు పిల్లలు చనిపోయాయి. మరోవైపు మార్చి నుండి ఇప్పటివరకు ఆరు చిరుతలు వివిధ కారణాల వల్ల మరణించాయి. దీంతో మొత్తం చిరుత మరణాల సంఖ్య తొమ్మిదికి చేరుకున్నాయి.

Exit mobile version