Site icon NTV Telugu

Madhya Pradesh: కునో నేషనల్ పార్క్ లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత నిర్వా

Kuno

Kuno

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో చిరుత నిర్వా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో పార్కులో చిరుతలు, పిల్లల సంఖ్య 29కి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో రక్షిత అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలను గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు. సీఎం మోహన్ యాదవ్ ఆదివారం రాత్రి X లో పోస్ట్ చేస్తూ.. ” కునోలోకి కొత్త అతిథులకు స్వాగతం.. కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య నిరంతరం పెరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది.

Also Read:Mega157 : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్..?

ఇటీవల, 5 ఏళ్ల నిర్వా 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ చిన్న పిల్లల రాక చిరుత ప్రాజెక్ట్ విజయానికి, భారతదేశంలోని గొప్ప జీవవైవిధ్యానికి చిహ్నం” అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం సృష్టించబడిన అనుకూలమైన వాతావరణం వృద్ధి చెందుతోందని యాదవ్ అన్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి కునో నేషనల్ పార్క్ మొత్తం బృందం, వన్యప్రాణి నిపుణులు, పరిరక్షణలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Also Read:DC vs RCB: దంచి కొట్టిన కోహ్లీ-క్రునాల్.. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం

రెండు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 20న కునోకు తరలించబడిన రెండు దక్షిణాఫ్రికా చిరుతలు, ప్రభాష్, పావక్‌లను నీముచ్, మాండ్‌సౌర్ జిల్లాలలో విస్తరించి ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి విడుదల చేశారు. సెప్టెంబర్ 17, 2022న ఎనిమిది నమీబియన్ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు, మూడు మగ చిరుతలను కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు. ఫిబ్రవరి 2023లో దక్షిణాఫ్రికా నుంచి కునోకు మరో పన్నెండు చిరుతలను తీసుకువచ్చారు. ఈ ఐదు పిల్లలు పుట్టక ముందు ఈ పార్క్ 24 చిరుతలకు నిలయంగా ఉండేది. వాటిలో 14 భారతదేశంలో జన్మించిన పిల్లలు ఉన్నాయి.

Exit mobile version