NTV Telugu Site icon

Leopard: బావిలో పడ్డ చిరుత.. రక్షించిన రెస్క్యూ టీం..!

Leopard

Leopard

Leopard: మనుషుల్లో పెరుగుతున్న దురాశ ఇతర జీవులకు హాని కలిగిస్తోంది. అడవులు, పచ్చదనం మెల్లమెల్లగా నాశనం అవుతుండటంతో.. వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్నాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోతుండడంతో.. అక్కడ నివసించే జీవులు ఆహారం వెతుక్కుంటూ జన నివాసాలకు చేరుకోవడంతో వాటికి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. అయితే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఓ చిరుతపులి బావిలో పడింది. అయితే దానిని బయటకు తీసేందుకు వారు శ్రమించిన తీరు అద్భుతం.

Read Also: London: డబ్బులు అడిగినందుకు సిక్కు టాక్సీ డ్రైవర్ హత్య.. హంతకుడికి జైలు శిక్ష..!

బావిలో పడ్డ చిరుతను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ నిమగ్నమై ఉన్నారు. అధికారులంతా చిరుతపులి పైకి ఎక్కి బయటకు వచ్చేలా బావిలో నిచ్చెన వేశారు. తన ఎదురుగా మనుషులను చూసి చిరుత పైకి రావడానికి భయపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు కర్రకు నిప్పంటించి బావిలో వేశారు. దీంతో చిరుతపులి భయపడి బావిలో నుంచి బయటకు వచ్చి మంటల నుంచి బయటపడి అడవి వైపు పరిగెత్తుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. 54 సెకన్లు ఉన్న ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. మరోవైపు అడవులను నరికివేయడం వల్ల వన్యప్రాణులు ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయని.. అందుకోసం అడవులను నాశనం చేయవద్దని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.