Site icon NTV Telugu

Che : విప్లవ యోధుడు చేగువేరా తెలుగు బయోపిక్ ‘చే’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2023 12 13 At 10.38.35 Pm

Whatsapp Image 2023 12 13 At 10.38.35 Pm

క్యూబా పోరాట యోధుడు చేగువేర జీవితంగా ఆధారంగా ‘చే’ మూవీ తెరకెక్కింది.. ‘లాంగ్ లివ్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక గా ఉంది.మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 15వ తేదీన ‘చే’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో చేగువేరా పాత్రను బీఆర్ సబావత్ నాయక్ పోషించారు. ఆయనే ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. అలాగే ఈ సినిమాలో లావణ్య సమీర, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనే, వినోద్ మరియు పాసల ఉమామహేశ్వర్ ముఖ్య పాత్రలు పోషించారు.’చే’మూవీని నేచర్ ఆర్ట్స్ పతాకంపై సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించారు. రవి శంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.ఇదిలా ఉంటే ‘చే’ మూవీ రిలీజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లోని ప్రసాద్ ల్యాబ్‍లో జరిగింది.చేగువేరా జీవితంపై సినిమా తెరకెక్కించాలన్నది తన 20ఏళ్ల కల అని హీరో మరియు డైరెక్టర్ అయిన బీఆర్ సబావత్ నాయక్ చెప్పారు.

పాఠశాల రోజుల నుంచి తనకు ఈ లక్ష్యం ఉందని ఆయన అన్నారు. స్నాక్స్ అమ్ముతూ డబ్బు దాచుకొని ‘చే’ చిత్రాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. చెగువేరా గౌరవం ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు సబావత్ అన్నారు. ‘చే’ సినిమా ప్రమోషనల్ మెటీరియల్స్ చూసి చెగువేరా కుమార్తె అలైడా గువేరా ప్రశంసించినట్లు ఆయన వెల్లడించారు.జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ.. ‘చే’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తారని ఆమె ఆశించారు. ఇలాంటి సినిమాలు యువతకు ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు.. చెగువేరా స్ఫూర్తి దాయక జీవితాన్ని తెలుగులో తీసుకొస్తున్నందుకు భరద్వాజ్ సంతోషం వ్యక్తం చేశారు.ప్రత్యర్థి మూవీ ఫేమ్ డైరెక్టర్ శంకర్ కూడా ‘చే ‘మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరయ్యారు. చేగువేరా జీవితకథను వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అద్భుతమని, ఈ సినిమాకు అందరూ మద్దతుగా నిలవాలని ఆయన తెలిపారు.

Exit mobile version