NTV Telugu Site icon

Maoists Letter : యుద్ధ వాతావరణం తెచ్చిన ప్రభుత్వం.. కూలీలను అరెస్ట్ చేస్తున్నారు

Maoists

Maoists

Maoists Letter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని జాగర్‌గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు. కాల్పుల్లో ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని, వీరి మృతదేహాలను తోటి నక్సలైట్లు అడవిలోకి తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ ప్రెస్ నోట్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Fire In Bus : సూర్యాపేట జిల్లాలో తప్పిన ప్రమాదం.. రెండు బస్సులు బుగ్గి

జాగర్‌గూడ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ దాడి పై బస్తర్ మొత్తాన్ని పోలీసు క్యాంపుగా ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. నాలుగు నెలల్లో మొత్తం తొమ్మిది క్యాంపులు తెరిచి ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారన్నారు. అత్యాధునిక సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లు, నిఘా విమానాల సహాయంతో ఆ ప్రాంతాన్ని పర్యావేక్షిస్తున్నారు. మినపా క్యాంపుతో సహా ఇతర పోలీస్ స్టేషన్లు, శిబిరాల్లో కాల్పులు, బాంబు దాడులకు రిహార్సల్ చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైమానిక దాడులను తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నాయని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు మిర్చి, కూలీ కోసం వెళ్తున్న కూలీలను కూడా మావోయిస్టు నేపథ్యంలో అరెస్టు చేస్తున్నారంటూ గంగ ఆరోపించారు .