Site icon NTV Telugu

ChatGPT : ప్రముఖ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ క్రాష్‌ డౌన్‌

Chatgpt

Chatgpt

ChatGPT : అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌లలో ఒకటైన ChatGPT సేవల్లో అంతరాయం నెలకొంది.  చాట్ జీపీటీ సేవల్లో అంతరాయం చోటు చేసుకోవడం యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా చాట్‌జీపీటీ మొరాయించింది. అయితే.. ఈ మధ్య చాట్‌జీపీటీ వినియోగం పెరగడంతో దీనిపై ఆధారపడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఎక్కువగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అదే విధంగా ఎక్సెల్ షీట్స్ దీంతో పాటు కోడింగ్ వంటి విషయాల్లో కూడా చాట్ జీపీటీ ప్రీమియం సర్వీసులను సైతం వాడుతున్నారు చాలామంది.

 Tummala Nageswara Rao : రైతు భరోసాపై కీలక విషయం చెప్పిన మంత్రి తుమ్మల

ఇప్పుడు చాట్‌జీపీటీలో సేవలకు అంతరాయం కలగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్స్‌ వేదికగా వినియోగదారులు తమ ఫిర్యాదులను చాట్‌జీపీటీకి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మాత్రం దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. దీంతో వినియోగదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ చాట్‌బాట్‌ అంతరాయం ఎప్పుడు తొలుగుతుందో కూడా క్లారిటీ లేకపోవడంతో నెట్టింట దీనిపై చర్చ మొదలైంది. మరోవైపు ఇటీవల గూగుల్‌ లాంఛ్‌ చేసిన గూగుల్ జెమినీ ఏఐ టూల్స్‌ను వాడుకునేందుకు ప్రజలు మొగ్గు చూపవచ్చు.

Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్‌ కాదు..

Exit mobile version