Site icon NTV Telugu

Chartered plane crash: సాంకేతిక లోపంతో కూలిపోయిన చార్టర్డ్‌ విమానం

Flight

Flight

Chartered plane crash: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చార్టర్డ్‌ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపంతో ఆ విమానం కూలినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులను పంపినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. నగరంలోని ఉచైన్ ప్రాంతంలోని బహిరంగ మైదానంలో విమానం కూలిపోయిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ సింగ్ తెలిపారు.

విమానం గాలిలో ఉండగానే మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంటలు చెలరేగిన చాలా సేపటికి విమానం నేలకూలింది. ఇదిలా ఉండగా.. అయితే అది హెలికాప్టరా లేక విమానమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.  ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది పౌర విమానమా లేక మిలిటరీ విమానమా అనేది ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Fighter Jets Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు యుద్ధవిమానాలు

వరుస విమాన ప్రమాదాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు కుప్పకూలిన సంగతి. శిక్షణ సమయంలో మెరెనాలో సుఖోయ్-30, మిరాజ్‌ యుద్ధ విమానాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలిసింది.

Exit mobile version