Charminar Express: నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. 50 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టడంతో యాభై మందికి గాయాలు కావడంతో పాటు ఒకరు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది. అయితే, ఈ ట్రైన్ చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ కు వస్తుండగా కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు స్టార్ట్ చేసింది. ఇక, ప్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టడంపై రైల్వే అధికారులు విచారణ చేస్తామని చెప్పుకొచ్చారు. అసలు సైడ్ వాల్ కు ఎలా ఢీకొట్టింది అనే దానిపై రైల్వే అధికారులు విచారణ చేయనున్నారు. గాయపడిన యాభై మంది ప్రయాణికులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరగడంతో మిగిలిన రైళ్లు ఆలస్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.. కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.. అప్పటికే రైళ్లోని ప్రయాణికులు అందరూ దిగారు అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Read Also: Sankranthi Movies: సంక్రాంతి సినిమాల జాతకం తెలిసే రోజు వచ్చేసింది…
Also Read
ఇక, నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ సైడ్ వాల్ ని తాకి భోగిలు పట్టాలు తప్పడంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ వ్యక్తం చేశారు. పట్టలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులను పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. వెంటనే జిల్లా యంత్రంగా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు